Site icon OkTelugu

Dhanush net worth: ధనుష్ నెట్ వర్త్ ఎంతో తెలుసా..? ఐశ్వర్య రజినీకాంత్ వాటా ఎంతంటే..?

Dhanush net worth

Dhanush net worth

Dhanush net worth: రజనీకాంత్ అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ధనుష్… కెరియర్ మొదట్లో డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అందించాడు. ఇక ఆ తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల వైపు తను అడుగులు వేశాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశామైతే ఉంటుంది. తన పాత్రతో ప్రేక్షకులందని మెప్పిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒకడిగా వెలుగొందుతుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ధనుష్ చేసిన సినిమాలు అతనికి ఉత్తమ నటుడిగా మంచి ఇమేజ్ ను తీసుకొస్తే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు అతన్ని స్టార్ హీరోగా నిలబెడుతున్నాయి… ఇక ధనుష్ నెట్ వర్త్ ఎంత అనే విషయం ప్రస్తుత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ధనుష్ తన ఎంటైర్ తన కెరియర్ లో చేసిన సినిమాలన్నింటికి కలిపి భారీ రేంజ్ రెమ్యునరేషన్స్ ను తీసుకున్నాడు. ఇక సినిమాలతో పాటుగా తను కొన్ని బిజినెస్ లను కూడా చేస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం ధనుష్ ఆస్తుల విలువ 3500 కోట్ల వరకు ఉంటుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇక అందులో ఐశ్వర్య రజనీకాంత్ కి సైతం వాటా ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి… అందులో నుంచి 1000 కోట్ల వరకు ఐశ్వర్య రజినీకాంత్’ కి వాటా ఉందట. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వీరిద్దరు సపరేట్ అయిపోయి ఉంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు మళ్లీ కలిసే ఆలోచన లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ధనుష్ సైతం ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. తన పర్సనల్ విషయాలను పక్కనపెట్టి సినిమాల మీదే ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే విధంగా చూసుకుంటున్నాడు.

ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లందరితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే తెలుగు డైరెక్టర్లతో సైతం ఆయన ఎక్కువగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం విశేషం. ఇక ఇప్పటికే వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సార్, శేఖర్ కమ్ములతో కుబేర అనే సినిమాలు చేశాడు…

Exit mobile version