Devara Movie USA Review: దేవర మూవీ యూఎస్ఏ రివ్యూ…ఇంతకు ఈ మూవీ హిట్టా ఫట్టా..?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రస్తుతం ప్రతి ప్రేక్షకుడికి విపరీతమైన అంచానాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడానికి మరికొన్ని గంటల సమయం పడుతుందన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో లను ఈరోజే యూఎస్ఏ లో ప్రదర్శించారు. మరి అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏం చెప్తున్నారు. అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : September 26, 2024 10:18 am

Devara Movie USA Review

Follow us on

Devara Movie USA Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పంథాలు తొక్కుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే కొత్త కథలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలో మన దర్శకులు రాసుకున్న కథలు కూడా మంచి విజయాలను సాధిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే పాన్ ఇండియాలో మంచి గుర్తింపు అయితే ఉంది. మన సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇక మన హీరోల నుంచి వచ్చే సినిమాలు మంచి సక్సెస్ లను సాధిస్తే మాత్రం మన వాళ్లకు ఫ్యూచర్ లో ఇంకా మంచి గుర్తింపు ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రస్తుతం ప్రతి ప్రేక్షకుడికి విపరీతమైన అంచానాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడానికి మరికొన్ని గంటల సమయం పడుతుందన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో లను ఈరోజే యూఎస్ఏ లో ప్రదర్శించారు. మరి అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏం చెప్తున్నారు. అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే వైజాగ్ లో సముద్రం మీద ఆధారపడి బతుకుతున్న కొన్ని కుటుంబాలను అల్లకల్లోలం చేయడానికి ఒక వ్యక్తి పూనుకుంటాడు. అలాగే ఈ వ్యక్తి కూడా ఆ కుటుంబాలలో నుంచి వచ్చిన వాడే కావడం విశేషం…అయితే అతనికి వ్యతిరేకంగా దేవర ప్రజలకు అండగా నిలబడతాడు. మరి ఆ దేవర ని ఎవరు చంపారు తన కొడుకు వచ్చి వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడనే ఒక పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక దేవరను చంపింది ఎవరు.? ఎందుకు చంపారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు కొరటాల శివ కథని రోటీన్ ఫార్ములాలో రాసుకున్నప్పటికీ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం సరికొత్త విధానాన్ని అనుసరించినట్టుగా యూఎస్ఏ లో ఈ సినిమాను చూసిన వాళ్ళు చెబుతున్నారు. నిజానికి కొరటాల శివ లాంటి దర్శకుడు సారి కొత్త మేకింగ్ విధానాన్ని అలవర్చుకొని చేసిన సినిమాగా కూడా ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతుండటం విశేషం…జూనియర్ ఎన్టీఆర్ నటన ఈ సినిమాకి చాలా అద్భుతంగా నిలిచింది. ఇక ఈ మ్యూజిక్ కొంతవరకు బాగున్నప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం అనిరుధ్ పెద్దగా ప్రభావాన్ని చూపించలేదని కూడా వాళ్ళు తెలియజేస్తుండటం విశేషం… ఇక మొత్తానికైతే దేవర సినిమా సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకు వెళుతుందని కూడా ఈ సినిమాను చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు తెలియజేయడం విశేషం…మరి ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో ఈ సినిమాని చేసి అక్కడి ప్రేక్షకులను మెప్పించినట్టుగా కూడా తెలుస్తుంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

జూనియర్ ఎన్టీయార్ ఈ సినిమాలో నటించిన నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ కూడా తన నటనలో పరిణితిని చూపించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఆమెకి ఒక మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆమెలో ఉన్న నటిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసినట్టుగా కూడా చెబుతున్నారు. ఇక తన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టు కూడా అక్కడి ప్రేక్షకులు చెప్తుండటం విశేషం…మరి మొత్తానికైతే దేవర సినిమా ఓవరాల్ గా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని ఈ సినిమా చూసిన చాలా మంది యుఎస్ఏ ప్రేక్షకులు చెబుతున్నారు.

టెక్నికల్ అంశాలు

మ్యూజిక్ విషయం లో అనిరుధ్ కొంత వరకు పర్లేదు అనేలా సాంగ్స్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇక భాగ్రౌండ్ మ్యూజిక్ లో పెద్దగా పస లేదనే కామెంట్లు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికి ఎన్టీయార్ మాత్రం ఈ సినిమాతో పూర్తి స్థాయి లో అలరించడని అక్కడి ప్రేక్షకులు చెబుతున్నారు… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయట…