
Samantha O baby : ఇది వరకు స్టార్ హీరోల సినిమాలు మరియు కుర్ర హీరోల బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవ్వడం చూసాము.కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రీ రిలీజ్ అవుతుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజిని సంపాదించిన సమంత మరియు నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘ఓ బేబీ’ సినిమా అతి త్వరలోనే రీ రిలీజ్ కాబోతుంది.
2019 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.నటిగా కూడా సమంత కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.అయితే ఈ సినిమాకి రీ రిలీజ్ కి ఒక స్టార్ హీరో మూవీ కి ఎంత హైప్ ఉంటుందో అంత హైప్ ఏర్పడింది.ముఖ్యంగా మల్టిప్లెక్స్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల కాలం లో చాలా మంది పెద్ద స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.ఏ సినిమాకి కూడా ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు.ఇప్పటి వరకు కేవలం పోకిరి, జల్సా , ఖుషి , బిల్లా వంటి సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి, ఇప్పుడు ‘ఓ బేబీ’ సినిమా కూడా సక్సెస్ అయితే మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించినట్టే అని చెప్పొచ్చు.నిన్న మొన్నటి వరకు మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడిన సమంత, విజయవంతంగా చికిత్స పూర్తి చేసుకొని సురక్షితంగా బయటపడింది.
వరుసగా ప్లాన్ చేసిన షూటింగ్ షెడ్యూల్స్ లో కూడా పాల్గొంటుంది.ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మేకర్స్ రాజ్ & DK తెరకెక్కిస్తున్న ‘సీటా డెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈమె , ఒక షెడ్యూల్ ని పూర్తి చేసింది.ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొంటుంది.అలా వరుసగా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది సమంత.