Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi next film with Maruthi: మారుతితో చిరు, రాక్షసుడు'లో రకుల్, 'జీ'కి...

Chiranjeevi next film with Maruthi: మారుతితో చిరు, రాక్షసుడు’లో రకుల్, ‘జీ’కి కేజీయఫ్, !

Chiranjeevi MaruthiTelugu Movies news Today: నేటి టాలీవుడ్ లో ఇన్ సైడ్ వార్తల విషయానికి వస్తే… తెలుగులో సూపర్ హిట్ అయిన ‘రాక్షసుడు’ సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసింది చిత్రబృందం. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఓకే చేశారు.

వచ్చే వారం స్టార్ట్ కానున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో రకుల్ పాల్గొంటుంది. అన్నట్టు కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి.. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘లూసిఫర్’ రీమేక్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ‘వేదాళం’ రీమేక్ తో పాటు బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

అయితే, బాబీతో సినిమాని మెగాస్టార్ పోస్ట్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు మారుతి (Maruthi), చిరుకు ఓ కథ చెప్పాడు. ఆ కథ మెగాస్టార్ కి బాగా నచ్చింది. పైగా మారుతి దగ్గర పూర్తి స్క్రిప్ట్ కూడా ఉంది. అందుకే, మారుతి సినిమాని ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నాడు చిరంజీవి.

ఇక ‘జాతిరత్నాలు’ హీరో నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నూతన దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. పాన్ ఇండియా మూవీ “కేజీయఫ్ చాప్టర్ 2” సినిమా సౌత్ ఇండియన్ అన్ని కీలక భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ వారు కొనుగోలు చేశారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular