Homeఎంటర్టైన్మెంట్Sreeja Kalyan Dev: శ్రీజ ఒక చోట కల్యాణ్ దేవ్ మరో చోట.. సెలబ్రిటీ కపుల్...

Sreeja Kalyan Dev: శ్రీజ ఒక చోట కల్యాణ్ దేవ్ మరో చోట.. సెలబ్రిటీ కపుల్ డైవోర్స్ ఖాయ‌మేనా..?

Sreeja Kalyan Dev: ఇటీవల కాలంలో సెలబ్రిటీ కపుల్స్ డైవోర్స్ తీసుకోవడం మనం చూశాం. సూపర్ స్టార్ రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య- ధనుష్ దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. కాగా, తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ డైవోర్స్ తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. వారు ఎవరంటే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-కల్యాణ్ దేవ్ దంపతులు.. గత కొద్ది రోజులుగా వీరి విడాకుల గురించి వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై అధికారికమైన ప్రకటన అయితే రాలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కాని శ్రీజ కాని, కల్యాణ్ దేవ్ కాని ఈ విషయంపై స్పందిచడం లేదు. అయితే, ఇలా వీరు విడపోబోతున్నారనే వార్తలు రావడానికి కారణం శ్రీజనే.

Sreeja Kalyan Dev
Sreeja Kalyan Dev

ఇటీవల కాలంలో శ్రీజ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో నేమ్ ను ‘శ్రీజ కల్యాణ్’ నుంచి ‘శ్రీజ కొణిదెల’గా మార్చేసింది. అంతే.. దాంతో నెటిజన్లు శ్రీజ త్వరలో కల్యాణ్ దేవ్ తో విడిపోబోతున్నదని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి కూడా. గతంలో హీరోయిన్ సమంత తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నేమ్ ‘సమంత అక్కినేని’ నుంచి ‘సమంత రూత్ ప్రభు’గా మార్చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్లీ అలానే జరగబోతున్నదని గెస్ చేస్తున్నారు.

Sreeja Kalyan Dev
Sreeja Kalyan Dev

Also Read: Sreeja: ‘నన్ను వదిలివెళ్ళినందుకు థాంక్స్’ అంటూ శ్రీజ ఎమోషనల్ పోస్ట్ ..! భర్త గురించేనా ?

శ్రీజ తన అన్నయ్య రామ్ చరణ్ తో కలిసి ముంబైలో హాలీడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ తాను బతికుండటానికి గల కారణాలివే అని క్యాప్షన్ ఇచ్చేసింది. అలా శ్రీజ ఒక చోట ఉండగా, కల్యాణ్ దేవ్ మరో చోట ఉన్నాడు. తన నెక్స్ట్ ఫిల్మ్ గురించి ఎగ్జైటింగ్ గా ఉందని, తాను కూడా చాలా సంతోషంగా ఉన్నానని, తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ గురించి ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు పెట్టాడు.

అలా శ్రీజ ఒక చోట కల్యాణ్ దేవ్ మరొక చోట ఉండటాన్ని బట్టి చూస్తుంటే త్వరలో డైవోర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్సెస్ ఉంటాయని కొందరు నెటిజన్లు గెస్ చేస్తున్నారు. ఇకపోతే కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన ‘సూపర్ మచ్చి’ చిత్రం ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై అనుకున్న స్థాయిలో ఆడలేదు. గత కొద్ది రోజులుగా కల్యాణ్ దేవ్ మెగా కాంపౌండ్ కు దూరంగా ఉంటున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

Also Read: Chiranjeevi Daughter Sreeja: నేను బతకడానికి నాకు సంతోషాన్ని ఇచ్చేది ఇవే – మెగా డాటర్ ‘శ్రీజ’

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Abbas: పాతికేళ్ల క్రితం, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. హీరో అబ్బాస్ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా ‘ప్రేమదేశం’ సినిమా తర్వాత అబ్బాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో ప్రేమికుడిగా.. ప్రియురాలి ప్రేమ కోసం పరితపించే పాత్రలో అబ్బాస్ నటన అద్భుతంగా ఉంటుంది. మెయిన్ గా అబ్బాస్ లుక్ అదుర్స్ అనిపిస్తుంది. అందుకే, అప్పట్లో యువతుల గుండెల్లో ఈ హ్యాండ్సమ్ హీరో గుబులు రేపాడు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular