Site icon OkTelugu

Casting Call For Prabhas New Movie: ప్రభాస్ తో నటించాలనుందా ? ఐతే.. ఇది మీ కోసమే

Casting Call For Prabhas New Movie: నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నూతన నటీనటులకి అవకాశం కల్పిస్తున్నారు. ఈక్రమంలో క్యాస్టింగ్ కాల్‌ను అనౌన్స్‌ చేశారు. ఫీనిక్స్ అరేనా, TSIIC పార్క్, హైటెక్ సిటీలో ఆడిషన్స్‌ ఉంటాయి. 30 సెకండ్ల పర్ఫామెన్స్‌తో నటీనటులు, మోడల్స్, డ్యాన్సర్లు, మ్యూజిషియన్లు తదితరులు తమ ప్రతిభను నిరూపించుకోవాలి. నేడు సా. 5 వరకు రేపు ఉ.9 – సా.9 వరకు ఆడిషన్స్ ఉంటాయి.

Casting Call For Prabhas New Movie

మరి ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏకంగా ప్రభాస్ తోనే నటించే ఛాన్స్ ను పొందొచ్చు. మరి నూతన నటీనటుల్లారా ఒకసారి ఆలోచించండి. ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై అధికారిక అప్ డేట్ కావాలంటూ గత కొంత కాలంగా ట్విట్టర్ లో సినిమా మేకర్స్ కి మెసేజ్ లు పెడుతూ వస్తున్నారు.

అయితే, సినిమా యూనిట్ ప్రస్తుత ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక గేమ్ షోను గ్రాండ్ గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే వారంలో యాక్షన్ సీన్స్ కోసం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ సీన్స్ షూట్ ను శరవేగంగా షూట్ చేయనున్నారు. ఇక మొదటినుంచీ ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకే నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో సినిమా జరుగుతుందట. ప్లాష్ బ్యాక్ లో ఈ దివి సీన్స్ వస్తాయని.. అలాగే సినిమాలో మూడు కాలాలకు సంబంధించిన కథ ఉంటుందని.. అయితే అన్నిటిలోకల్లా దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.

Prabhas y

అలాగే ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ కథలో రెండు విభిన్న పాత్రలను సృష్టించాడని.. పైగా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. అందుకే అన్ని భాషల వారికి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని టీమ్ నమ్మకంగా ఉంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంది.

Exit mobile version