Samantha : గోల్డెన్ లేడీ గా తెలుగు ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా తిరుగులేని హీరోయిన్ గా పేరు పొందారు సమంత.
తన నటనతో అభినయ మైన సౌందర్యంతో అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకున్నారు ఈ అమ్మడు. తన వ్యక్తిగత విషయాలు సైతం ఎదుర్కొని సినీ పరిశ్రమలో నిలదొక్కుకొని కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారారు సమంత.
ప్రస్తుతం సమంత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సమంత తన రెమ్యునరేషన్ ను అమాంతంగా పెంచేసిందని సమాచారం. కొత్త ప్రాజెక్టులకు సమంత రూ.3 కోట్లు తీసుకుంటుందని అయితే తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా నిలిచిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమని అధికారకంగా తెలియాల్సి ఉంది.
సమంత ప్రస్తుతం రెండు సినిమాల్లో నటించనున్నారు డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో ఒక సినిమా చేస్తున్నట్లు ఈ మూవీ కి కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో ” ప్రొడక్షన్ నెం.30 ” అనే టైటిల్ తో ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఇంకొక సినిమా ఓకే చేశారట సామ్ ఈ చిత్రానికి హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. సామ్ ప్రస్తుతం తెలుగులో పౌరాణిక చిత్రమైన “శాకుంతలం” నటించిన సంగతి తెలిసిందే ఈ మూవీని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు గుణ శేఖర్.తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి కి జోడిగా నయనతార సమంత నటించిన ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానున్నట్లు సమాచారం.