Bro Movie : ‘బ్రో ది అవతార్’ మొదటి లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్ వచ్చేసింది..బ్రాండ్ న్యూ పోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్స్ అదుర్స్

ఈ పాట గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలా గొప్పగా చెప్తున్నాడు. అదిరిపోయే రేంజ్ లో ఈ సాంగ్ వచ్చిందని, ఫ్యాన్స్ ఈ పాటకి అడిక్ట్ అయిపోతారని , అలాంటి మ్యూజిక్ ని థమన్ అందించాడని అంటున్నారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ తన వింటేజ్ ఎనర్జీ తో స్టెప్పులు కూడా వేసాడట. ఇప్పటి వరకు బ్రో చిత్రం ప్రొమోషన్స్ సరిగా చెయ్యడం లేదని ఫ్యాన్స్ ఎంతో నిరాశకి గురి అవుతూ వచ్చారు.

Written By: NARESH, Updated On : July 8, 2023 8:20 am
Follow us on

Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు చకచకా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కొద్దిరోజుల క్రితం విడుదల అవ్వగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట అప్డేట్ వచ్చింది. ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే ఈ మొదటి పాట ని రేపు సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టుగా కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక స్టైలిష్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు.

ఈ పాట గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలా గొప్పగా చెప్తున్నాడు. అదిరిపోయే రేంజ్ లో ఈ సాంగ్ వచ్చిందని, ఫ్యాన్స్ ఈ పాటకి అడిక్ట్ అయిపోతారని , అలాంటి మ్యూజిక్ ని థమన్ అందించాడని అంటున్నారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ తన వింటేజ్ ఎనర్జీ తో స్టెప్పులు కూడా వేసాడట. ఇప్పటి వరకు బ్రో చిత్రం ప్రొమోషన్స్ సరిగా చెయ్యడం లేదని ఫ్యాన్స్ ఎంతో నిరాశకి గురి అవుతూ వచ్చారు.

కానీ ఈ పాట తర్వాత మాత్రం అలాంటి ఆలోచన రాదనీ, సినిమాకి కావాల్సిన హైప్ ని మొత్తం ఈ పాట తీసుకొస్తుందని అంటున్నారు. మరి ఇంతలా హైప్ రేపుతున్న సాంగ్ నిజంగా ఫ్యాన్స్ కి కూడా నచ్చుతుందో లేదో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.