Janhvi Kapoor:’జాన్వీ కపూర్’ అంటేనే అందాల రాశి. కానీ, ఈ ఫోటోలోని ఆమె అందాన్ని ఏమని పిలవాలి ? శిలువ వేసిన అందం అనాలా ? గుండె గదిలో తిష్ఠ వేసిన జాబిల్లి అని పొగడాలా ? రాశులుగా ధారబోసిన అందం అని ప్రశంసించాలా? ఏమని పిలిస్తే సబబు ?, అసలు ఏమి పిలిచినా ఈ ఫోటోల్లోని ‘జాన్వీ కపూర్’ అందానికి నిర్వచనం ఇవ్వగలమా ?, విరబూసిన మందార పువ్వులా ఆమె ఇలా కవ్విస్తూ కనిపిస్తే.. నెటిజన్లు చూస్తూ ఎలా ఉండగలరు ?, కాళిదాసులుగా మారి, కొన్ని ప్రేమ పంక్తుల్ని చెబుతారేమో.

ఏది ఏమైనా, జాన్వీ కపూర్ స్టైల్ కంటెంట్ ఎలివేషన్ కి, యూత్ మెంటలెక్కిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆమెలో అందానికి అందం ఉంది, ప్రతిభతో పాటు తెగింపు కూడా ఉంది. ఇప్పటికే జాన్వీ కపూర్ హిందీ సినీ పరిశ్రమలో నటిగా నిరూపించుకుని తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కెరీర్ ని జయాపజయాలతో ముడి వేయకుండా నెమ్మదిగా తెలివిగా ముందుకు సాగిస్తోంది.
Also Read: Minister Botsa Satyanarayana: మారిన బొత్స తీరు.. అసలు కారణం అదేనా?

ప్రస్తుతం, హిందీలో మూడు ముక్కలాట ఆడుతోంది. తెలుగులో కూడా మరో ముక్క వేయడానికి సన్నద్ధం అవుతుంది. తాజా జిమ్ లుక్ తో మతులు చెదరగొట్టింది జాన్వీ కపూర్. అల్ట్రా స్టైలిష్ జాన్వీ కపూర్ అలా టైట్ డ్రెస్ తో మైండ్ బ్లాక్ చేసింది. క్రీగంటి చూపులతో కుర్రకారును గిజగిజలాడించింది! అన్నట్టు అమ్మడు అలా చేతులు వెనక్కి పెట్టి.. అలా అలా ఒళ్ళు విరవడం.. శిలువను ధరించి మంత్రముగ్ధురాలిని తలపిస్తోంది.

మొత్తానికి జాన్వీ ఏదో మాయ చేస్తోంది. ఈ ఫోటోలు చూశాక, ఏ కామెంట్ ఎట్నుంచి పడుతుందో ఊహించలేం. ఆ రేంజ్ లో ఆకట్టుకున్నాయి ఈ ఫోటోలు. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీ కపూర్ ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తోంది. ఇందులో హిందీ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోందని, అలాగే ఎన్టీఆర్ తో కూడా మరో సినిమా చేస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే, హిందీతో పాటు సౌత్ లోనూ జాన్వీ కపూర్ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్టే సౌత్ సినిమాల పై ఫోకస్ పెట్టింది. మరి, మునుముందు జాన్వీ కపూర్ ని కూడా `పాన్ ఇండియా హీరోయిన్` అని పిలిచే రోజొస్తుందేమో చూడాలి.
Also Read:Pawan Kalyan : కోనసీమ ఉద్రిక్తతలకు కారణం వారే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
[…] […]
[…] […]