Site icon OkTelugu

Bloody Romeo movie Heroine: ‘బ్లడీ రోమియో’ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోయిన్.. సుజిత్ ప్లానింగ్ మామూలుగా లేదు

Bloody Romeo movie Heroine

Bloody Romeo movie Heroine

Bloody Romeo movie Heroine: నేడు నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆయన అప్డేట్స్ తో నిండిపోయింది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ‘ది ప్యారడైజ్'(The Paradise) చిత్రానికి సంబంధించిన ‘ఆయా షేర్’ పాట కాసేపటి క్రితమే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా , ఈ చిత్రం తర్వాత ఆయన డైరెక్టర్ సుజిత్ తో చేయబోతున్న ‘బ్లడీ రోమియో'(Bloody Romeo) చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇలా ఆయన నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. అయితే ‘బ్లడీ రోమియో ‘ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రం లో హీరో పాత్ర ఎంత కీలకమో , హీరోయిన్ పాత్ర కూడా అంతే కీలకం.

ఒకపక్క అందం చూపిస్తూనే , మరోపక్క అద్భుతమైన నటన కూడా చూపించాలి. అందుకే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమిరి ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈమె ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ లో కూడా అవకాశం సంపాదించి హాట్ టాపిక్ గా మారింది. ఈమె ఎంట్రీ తర్వాత ఈ చిత్రానికి నార్త్ ఇండియా లో క్రేజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమ్మర్ నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్నందుకు గానూ త్రిప్తి దిమిరి ఏకంగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. కొత్త హీరోయిన్స్ , ఫ్లాప్ హీరోయిన్స్ కూడా మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ రోజుల్లో , పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న త్రిప్తి దిమిరి 5 కోట్లు తీసుకోవడం లో ఎలాంటి తప్పు లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే నేడు విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ గ్లింప్స్ వీడియో లో ఎక్కడా కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పలేదు. ‘ఓజీ’ కి తమన్ అందించిన మ్యూజిక్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాబట్టి సుజిత్ తన తదుపరి చిత్రానికి కూడా తమన్ ని పెట్టుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అది జరగడం లేదు. ఈ చిత్రానికి సుజిత్ ‘ధురంధర్’ కి అద్భుతమైన మ్యూజిక్ ని అందించిన శశ్వత్ సచ్దేవ్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారట.

Exit mobile version