Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలైట్స్: ప్రియాంక పెళ్లి గోల, శత్రువుని పొగిడి షాక్ ఇచ్చిన ప్రియుడు, బాంబు పేల్చిన భోలే భార్య

ఆమెకు గులాబీ రొమాంటిక్ పోజులో ఇచ్చాడు. ప్రియాంక చాలా ఆనందం వ్యక్తం చేసింది. వీరి రొమాన్స్ కొంచెం హద్దులు దాటేసింది. కెమెరాలు, హౌస్ మేట్స్ ఉన్నారని కూడా పట్టించుకోకుండా ముద్దులు, హగ్గులు లాగించేశారు.

Written By: NARESH, Updated On : November 9, 2023 8:29 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం శివాజీ కొడుకు కెన్నీ, అర్జున్ భార్య సురేఖ, అశ్విని మదర్ వచ్చారు. వీరి మధ్య కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. బుధవారం ఎపిసోడ్లో మరో ఇద్దరు కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రియాంక జైన్ కోసం మాత్రం ప్రియుడు శివ కుమార్ వచ్చాడు. శివకుమార్ వస్తూ తనతో పాటు రోజా తెచ్చాడు. రాగానే ప్రియాంకను గట్టిగా హత్తుకున్నాడు.

ఆమెకు గులాబీ రొమాంటిక్ పోజులో ఇచ్చాడు. ప్రియాంక చాలా ఆనందం వ్యక్తం చేసింది. వీరి రొమాన్స్ కొంచెం హద్దులు దాటేసింది. కెమెరాలు, హౌస్ మేట్స్ ఉన్నారని కూడా పట్టించుకోకుండా ముద్దులు, హగ్గులు లాగించేశారు. అనంతరం ప్రియాంకకు గేమ్ విషయంలో కొన్ని సలహాలు ఇచ్చాడు. పెళ్లి ఎప్పుడని ప్రియాంక పదే పదే అడిగింది. నువ్వు బయటకు రాగానే చేసుకుందాం అని హామీ ఇచ్చాడు. ఒంటరిగా గేమ్ ఆడాలని పరోక్షంగా శోభ, అమర్ లకు దూరంగా ఉండాలని చెప్పాడు. అనూహ్యంగా శివ కుమార్ అశ్విని గేమ్ ని పొగిడారు. ఆమె రోజా పువ్వులా అందంగా ఉందని పొగడడంతో ప్రియాంక ముఖం మాడిపోయింది.

తర్వాత గౌతమ్ తల్లి వచ్చింది. కన్నయ్య… కన్నయ్య… అని ప్రేమగా పిలుస్తూ ఆమె హౌస్లోకి వచ్చారు. కొడుక్కి స్వయంగా గోరుముద్దలు తినిపించింది. అందరితో ఆమె మంచిగా మాట్లాడింది. బాగా ఆడుతున్నావు. నీకు అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిందని ఆమె గౌతమ్ కి చెప్పింది. తర్వాత పర్సనల్ గా… కోపం తగ్గించుకో. ఆవేశంలో ఒక్కోసారి మాటలు జారుతున్నావని గౌతమ్ కి తల్లి సలహా ఇచ్చింది. గౌతమ్ తల్లిని చూసి యావర్ ఎమోషనల్ అయ్యాడు. నేను నీకు తల్లినే అని యావర్ ని ఆమె ఓదార్చారు.

తర్వాత భోలే వైఫ్ ఎంట్రీ ఇచ్చింది. భోలే తన శ్రీమతి కోసం వరుసగా పాటలు పాడాడు. తనకు కొడుకు గుర్తుకు వస్తున్నాడని కన్నీరు పెట్టుకున్నాడు. కప్పు కాదు ప్రేక్షకుల మనసులు గెలుచుకుని వస్తానని భార్యతో అన్నాడు. భోలేతో భార్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. హౌస్లో స్కూల్ టాస్క్ నవ్వులు పూయించింది. ఇక నేడు మరికొందరు కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వనున్నారు.