Bigg Boss 6 Telugu- Nagarjuna: నాగార్జున నిన్న ఎపిసోడ్ లో పిచ్చ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. వస్తూ వస్తూనే తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ని సపరేట్ గా నిలబెట్టాడు. బాల ఆదిత్య, వాసంతి, షాని, శ్రీ సత్య, కీర్తి, రోహిత్-మెరీనా, సుదీప, శ్రీహాన్, అభినయశ్రీ అసలు గేమ్ ఆడటం లేదన్నాడు. ఈ తొమ్మిది మంది కాకుండా మిగతా కంటెస్టెంట్స్ లో కూడా కొందరికి నాగార్జున క్లాస్ పీకాడు. కంటెస్టెంట్స్ ఎవరూ బిగ్ బాస్ షోని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఏదో తింటానికి, పడుకోవడానికి వచ్చారు. హౌస్ చాలా చల్లగా ఉంటుంది. దీంతో చిల్ అవుతున్నారని మండిపడ్డాడు. ఇక్కడ నాగార్జున అసహనానికి పెద్ద కారణమే ఉంది. అది షో టీఆర్పీ.

బిగ్ బాస్ సీజన్ 6 లాంచింగ్ ఎపిసోడ్ కి దారుణమైన రేటింగ్ వచ్చింది. ఇది గత ఐదు సీజన్స్ కంటే అత్యల్పంగా ఉంది. కనీసం సగం కూడా లేదు. బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్స్ లో సీజన్ 4కి అత్యధికంగా 18కి పైగా రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ సీజన్స్ 6 ఫస్ట్ ఎపిసోడ్ కి అది 8.8 గా నమోదైంది. దీన్ని బట్టి చెప్పొచ్చు బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ఎంత పెద్ద ఫెయిల్యూరో. దీంతో చిర్రెత్తుకొచ్చింది నిర్వాహకులు హోస్ట్ నాగార్జునను ఎగదోశారు. మీరు కంటెస్టెంట్స్ ని బాగా తిట్టి వాళ్లలో కసి పెంచాలని చెప్పి పంపారు.
నిర్వాహకుల ఆదేశాల మేరకు నాగార్జున కంటెస్టెంట్స్ తో లేని కోపాన్ని నటించారు. గేమ్ ఇలా కూల్ గా ఆడితే కుదరదంటూ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అసలు నాగార్జున వాళ్లపై కోప్పడ్డ తీరు చూస్తే కారణం లేకున్నా తోటి కంటెస్టెంట్స్ తో గొడవలు పడాలి. కాంట్రవర్సీ సృష్టించాలి . ఎప్పుడూ ఏదో ఒక గలాటా చేసి స్పైసీ కంటెంట్ ప్రేక్షకులకు ఇవ్వాలి. ఒకరిద్దరు ఆడే టాస్క్స్ లో ఎంత మందికి అవకాశం వస్తుంది చెప్పండి. 21 మంది పోటీపడాలంటే సాధ్యమేనా. ఇక్కడ నాగార్జున అదే అంటున్నారు. అవకాశం సృష్టించుకొని పోటీపడాలని చెప్తున్నారు.

మొత్తంగా నాగార్జునలో టీఆర్పీ రావడం లేదన్న అసహనం కనిపించింది. ఓ రేంజ్ లో నిన్న హౌస్ మేట్స్ ని రెచ్చగొట్టి వదిలారు. ఇకపై కంటెస్టెంట్స్ ఏ స్థాయిలో రెచ్చిపోతారో చూడాలి. కనీస ప్రదర్శన లేదన్న నెపంతో నాగార్జున డీగ్రేడ్ చేసిన తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నుండి షాని ని నాగార్జున ఎలిమినేట్ చేశారు. నిన్న షాని హౌస్ నుండి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఎలిమినేషన్ లో ఉన్న షాని ఎలిమినేటై వెళ్లిపోగా ఇంకా ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ లో ఉన్నారు. వీరిలో ఒకరు నేడు హౌస్ వీడనున్నారు. అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదని అంచనా.