Bigg Boss 6 Telugu 8th Week: బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ గా శ్రీహాన్ అవతరించాడు. కెప్టెన్సీ టాస్క్ లో చివరి వరకూ నిలిచిన శ్రీహాన్ మొదటిసారి ఆ హోదా దక్కించుకున్నాడు. ఈ వారం కెప్టెన్సీలో భాగంగా చేపల చెరువు టాస్క్ ఇవ్వడం జరిగింది. గార్డెన్ ఏరియాలో గాల్లో నుండి బొమ్మ చేపలు పడుతూ ఉంటాయి. ఇద్దరిద్దరుగా విభజించబడిన టీమ్ సభ్యులు ఆ చేపలను సేకరించి, ఇతర కంటెస్టెంట్స్ నుండి కాపాడుకోవాలి. బజర్ మోగినప్పుడు అప్పటి వరకు సేకరించిన చేపలను కౌంట్ చేస్తారు. తక్కువ చేపలు ఉన్న టీం ఎలిమినేట్ అవుతుంది.

అనేక వ్యయప్రయాసల మధ్య ఈ టాస్క్ చివరి దశకు శ్రీహాన్, కీర్తి, సూర్య చేరుకున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని కెప్టెన్ గా ఇంటి సభ్యులు ఎన్నుకోవాలి. ముగ్గురిలో ఎవరు కెప్టెన్ కాకూడదని భావిస్తున్నారో ఆ కంటెండర్ మెడలో ఉన్న లెటర్ ‘C’ కి కత్తి గుచ్ఛాలి. తక్కువ కత్తి పోట్లు పడ్డ కంటెండర్ కెప్టెన్ గా ఎన్నికవుతాడు. ఆల్రెడీ కీర్తి, సూర్య కెప్టెన్స్ గా చేశారు. దీంతో శ్రీహాన్ కి అవకాశం ఇచ్చారు. శ్రీహాన్ కి తక్కువ కత్తి పోట్లు పడడంతో కెప్టెన్ అయ్యాడు. కీర్తి, సూర్య అవకాశం కోల్పోయారు.
ఇక బిగ్ బాస్ ఇంటికి కొత్త కెప్టెన్ గా శ్రీహాన్ అవతరించాడు. ఏ మేరకు శ్రీహాన్ కెప్టెన్సీ బాధ్యతలు నెరవేరుస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ కావడం ఒకింత మైనస్ కూడాను. ఇంటి సభ్యులతో పనులు చేయిస్తూ రూల్స్ పాటించేలా చూసే క్రమంలో శత్రువులు తయారవుతారు. అందరినీ సంతృప్తి పరిచే కెప్టెన్ కావడం నిజంగా రిస్క్ తో కూడుకున్న పని. ప్రస్తుతానికి మెజారిటీ ఇంటి సభ్యుల్లో శ్రీహాన్ కి మంచి పేరుంది. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మోస్ట్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఎవరంటే మెజారిటీ ఇంటి సభ్యులు శ్రీహాన్ పేరు చెప్పారు.

కాగా ఈ వారం ఎలిమినేషన్ చాలా ఆసక్తికరం. ఎందుకంటే హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందిగ్ధత నెలకొంది. రేవంత్, బాల ఆదిత్య, గీతూ, ఆదిరెడ్డి, ఫైమా, ఇనయా, శ్రీహాన్ వంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎలిమినేటయ్యే ఛాన్స్ లేదు. రోహిత్ – మెరీనా గ్రాఫ్ కొంచెం పెరిగింది. వాళ్ళకు ఆడియన్స్ లో సానుభూతి కూడా ఉంది. కాబట్టి సూర్య, వసంతి, శ్రీసత్య, రాజ్ లలో ఒకరు ఎలిమినేట్ కావచ్చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.