Bigg Boss 6 Telugu 12th Week Nominations: భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరి దశకి చేరుకుంది… ఊహించని మలుపులతో ప్రేక్షకులకు మతులను పొగడుతూ ముందుకు దూసుకుపోయిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి మంచి TRP రేటింగ్స్ అయితే వచ్చాయి కానీ.. ముందు సీజన్స్ తో పోలిస్తే తక్కువే అని చెప్పాలి.. ఈ సీజన్ ప్రారంభం లో కంటెస్టెంట్స్ తాస్కులు చాలా తేలికగా తీసుకొని ఆడడం వల్లే TRP రేటింగ్స్ తక్కువ రావడానికి కారణమని అంటున్నారు విశ్లేషకులు.. ఇదంతా పక్కన పెడితే ప్రతి వారం లాగ కాకుండా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా ప్రశాంతమైన వాతావరణం లో కొనసాగింది.. ఇదివరకు కంటెస్టెంట్స్ ఒకరి మొహం మీద ఒకరు నేరుగానే కారణాలు చెప్పి నామినేట్ చేసేవారు.. కానీ ఈ వారం బిగ్ బాస్ ఆ పద్దతిని పక్కన పెట్టి కంటెస్టెంట్స్ ని కన్ఫషన్ రూమ్ లోకి పిలిచి కారణాలు చెప్పి ఇద్దరు ఇంటి సభ్యుల ఫోటోలను శ్రద్దర్ లో వేసే అవకాశం కల్పించారు.. అందువల్ల ఈసారి గొడవలు లేకుండా నామినేషన్స్ జరిగిపోయాయి.

ఇక ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేటైనా ఇంటి సభ్యులు శ్రీహన్, రోహిత్,ఆది రెడ్డి, కీర్తి, ఐనాయా సుల్తానా, శ్రీ సత్య, ఫైమా మరియు రాజ్..ఇప్పటి వరుకు 11 వారాలు బిగ్ బాస్ కొనసాగితే 9 వారాలు నామినేషన్స్ కి వచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పిన రేవంత్, ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు..

ఇది ఆయన ఫాన్స్ కి కాస్త ఉపశమనం కలిగించే విషయం..ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ ఇక నుండి తాస్కులను మరింత కఠినంగా మార్చాబోతున్నాడు..12 వారం లోకి అడుగుపెట్టడం తో ప్రేక్షకులను మరింత ఉత్కంటకి గురించి చేసే విధంగా తాస్కులను డిజైన్ చేసాడట బిగ్ బాస్.. అంతే కాకుండా ఈ వారం కంటెస్టెంట్స్ కి సంబందించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి రాబోతున్నారట.. ఆద్యంతం ఉత్కంట భారీతంగా సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో చివరి రోజుల్లో ఇంకా ఏ రేంజ్ లో అలరించబోతుందో చూడాలి.
Also Read:Kantha Rao Family: కాంతారావు కుటుంబం కష్టాలకి సమాజం ఎలా బాధ్యత తీసుకుంటుంది?
[…] Also Read: Bigg Boss 6 Telugu 12th Week Nominations: బిగ్ బాస్ 12 వ వారం నామి… […]