Bigg Boss Sunny: బిగ్​బాస్​ టైటిల్ విన్నర్​ సన్నీకి కరెంట్ షాక్​.. అసలేం జరిగిందంటే?

Bigg Boss Sunny: ఎంతో ఉత్కంఠగా సాగిన బిగ్​బాస్​ తెలుగు సీజన్​5 విజేతగా సన్నీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రోఫీ గెలిచొచ్చి హౌస్​ నుంచ బయటకు వచ్చిన తర్వాత మీడియాలన్నీ అతని ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్​లో జరిగిన ప్రెస్​మీట్​లో పలు మీడియా ఛానల్లు, యూట్యూబ్ ఛాన్సల్స్ పాల్గొన్నాయి. అయితే, ఈ కార్యక్రమంలో సన్నీకి తృటిలో ప్రమాదం తప్పింది.. సన్నీ చేతికి కరెంట్​ షాక్ కొట్టింది. Also Read: బిగ్ బాస్ టాప్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 22, 2021 3:18 pm
Follow us on

Bigg Boss Sunny: ఎంతో ఉత్కంఠగా సాగిన బిగ్​బాస్​ తెలుగు సీజన్​5 విజేతగా సన్నీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రోఫీ గెలిచొచ్చి హౌస్​ నుంచ బయటకు వచ్చిన తర్వాత మీడియాలన్నీ అతని ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్​లో జరిగిన ప్రెస్​మీట్​లో పలు మీడియా ఛానల్లు, యూట్యూబ్ ఛాన్సల్స్ పాల్గొన్నాయి. అయితే, ఈ కార్యక్రమంలో సన్నీకి తృటిలో ప్రమాదం తప్పింది.. సన్నీ చేతికి కరెంట్​ షాక్ కొట్టింది.

Bigg Boss Sunny

Also Read: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఎవరికి ఎక్కువంటే?

సన్నీ పక్కన మాట్లాడుతూ.. తన ఫోన్​లో ఓ క్లిప్​ను చూపించేందుకు పోన్​ పట్టుకున్నారు.. అయితే, ఆ ఫోన్ సిస్టమ్​కు కనెక్ట్ అయి ఉంటంతో కొద్దిగా షాక్ కొట్టింది. దీంతో తన చేతిని సన్నీ వెనక్కి లాగేసుకున్నాడు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదు. అయితే, ఇది చిన్నపాటి ఘటనే అయినప్పటికీ.. సన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను సోషల్​మీడియాలో వైరల్​గా మార్చేశారు.

మొదట రిపోర్టర్​గా కెరీర్​ మొదలుపెట్టిన సన్నీ.. ఆ తర్వాత యాంకర్​గా ఎదిగి.. బిగ్​బాస్​ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలోనే తొలుత సన్నీకి హౌస్​తో పాటు, ప్రజల్లో కాస్త నెగిటివిటీ వచ్చినా.. మెల్లగా అతనిపై జనాల్లో క్రేజ్​ పెరగడం మొదలైంది.  ఓటింగ్​ ప్రాసెస్​లో నెగ్గుతూ… చివరకు హౌస్​మేట్స్ అందర్నీ దాటుకుని విన్నర్​గా నిలిచాడు. ఈ క్రమంలోనే తనకు అండగా నిలిచిన హౌస్​మేట్స్​, ప్రేక్షకులతో పాటు నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
Also Read: షణ్ముఖ్​, సిరి రిలేషన్​పై క్లారిటీ ఇచ్చిన సన్ని