Bhole Shavali: బిగ్ బాస్ టాప్ 5 ఎవరో తేల్చేసిన భోలే షావలి… అదే జరిగితే సంచలనమే!

భోలే మాట్లాడుతూ .. ' బిగ్ బాస్ ఇంటిలోకి ఎలాంటి ప్లాన్ చేసుకుని, సోషల్ మీడియాకి సంబంధించి పీఆర్ డిజైన్ చేసుకుని వెళ్ళలేదు. పాట బిడ్డగా ఇంట్లోకి వెళ్లి .. పాట బిడ్డగా రావాలని అనుకున్నాను. వారం రోజులు ఉన్నాగాని.. నా అస్థిత్వాన్ని అక్కడే వదిలి రావాలని అనుకున్నాను

Written By: NARESH, Updated On : November 17, 2023 11:02 am

Bhole Shavali

Follow us on

Bhole Shavali: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ భోలే షావలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట బిడ్డగా హౌస్ లో అడుగుపెట్టి.. తనదైన శైలిలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. అప్పటికప్పుడు పాటని కంపోజ్ చేసి పాడటంలో భోలే కి ఎవరు సాటి రారు. అయితే వైల్డ్ కార్డు ద్వారా ఐదో వారంలో హౌస్ లోకి అడుగుపెట్టిన భోలే పదో వారంలో ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన హౌస్ లో ఉన్న వాళ్ళ లో టాప్ 5 లో ఎవరు ఉంటారో అంచనా వేశాడు.

భోలే మాట్లాడుతూ .. ‘ బిగ్ బాస్ ఇంటిలోకి ఎలాంటి ప్లాన్ చేసుకుని, సోషల్ మీడియాకి సంబంధించి పీఆర్ డిజైన్ చేసుకుని వెళ్ళలేదు. పాట బిడ్డగా ఇంట్లోకి వెళ్లి .. పాట బిడ్డగా రావాలని అనుకున్నాను. వారం రోజులు ఉన్నాగాని.. నా అస్థిత్వాన్ని అక్కడే వదిలి రావాలని అనుకున్నాను. అలా 5 వారాలు ఇంట్లో ఉండి వచ్చాను అని భోలే అన్నారు.

ఇంటిలో నేను అడుగుపెట్టేసరికి రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. సీరియల్ బ్యాచ్ అందరూ ఒకటిగా ఆడుతున్నారు. శివాజీ గ్రూప్ మరో వైపు ఆడుతున్నారు. నేను కేవలం ఎంటర్టైనర్ గా ఇంటిలో పాటలు పాడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాను. అయితే నన్ను సీరియల్ బ్యాచ్ దారుణంగా ఎటాక్ చేయడంతో మిస్ అయ్యి కొన్ని సార్లు బూతులు మాట్లాడినా .. వెంటనే సరిదిద్దుకుని సారి చెప్పను. తన తప్పును తాను తెలుసుకున్న వాడికంటే ఉత్తముడుండడు అనేది నా అభిప్రాయం అని భోలే చెప్పారు.

అమర్ దీప్ తో నాకు ఎలాంటి గొడవలు లేవు. బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లోకి అవకాశాలు ఉన్న వారిలో పల్లవి ప్రశాంత్ టాప్ స్థానంలో ఉంటాడు. రైతు బిడ్డగా కేవలం శారీరక బలమే కాదు .. బుద్ధి బలం కూడా ఉపయోగించడం చూసి ఇష్టపడ్డాను. శివాజీ కూడా టాప్ 5 లో ఉంటారు. ప్రిన్స్ యావర్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అశ్విని శ్రీ అలాగే అమర్ దీప్ లేదా ప్రియాంక జైన్ గాని టాప్ 5 లో ఉండే అవకాశం ఉందని భోలే చెప్పుకొచ్చారు.