Site icon OkTelugu

Bhola Shankar Teaser: భోళా శంకర్ టీజర్ వచ్చేస్తుంది… ఫ్యాన్స్ లో నెలకొన్న ఉత్కంఠ!

Bhola Shankar Teaser

Bhola Shankar Teaser

Bhola Shankar Teaser: మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు. ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు విడుదల చేసిన ఆయన మరో మూవీ సిద్ధం చేశారు. దర్శకుడు మెహర్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. నేడు సాయంత్రం భోళా శంకర్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న అప్డేట్ మరి కొన్ని గంటల్లో రానుంది. చిరంజీవి మరోసారి ఊర మాస్ రోల్ చేశారు. ఆయన లుక్స్ వింటేజ్ చిరును గుర్తు చేశాయి.

సాయంత్రం 4 గంటల నుండి భోళా శంకర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్, చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. అజిత్ హీరోగా నటించిన ఆ మూవీ భారీ విజయం సాధించింది. దీంతో భోళా శంకర్ తో చిరంజీవి బాక్సాఫీస్ షేక్ చేస్తారని ఫ్యాన్ ఫిక్స్ అయ్యారు.

ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించడం మరొక విశేషం. ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు పాత్ర చేయడం అరుదైన విషయం. కథలో కీలక పాత్ర కావడంతో కీర్తి సురేష్ ని తీసుకున్నారు. మొదట సాయి పల్లవిని ఈ పాత్ర కోసం అనుకున్నారు. చిరంజీవి-కీర్తి సురేష్ ల అన్నా చెల్లెలు సెంటిమెంట్ సినిమాకు హైలెట్ కానున్నాయి.

తమన్నా చిరంజీవికి జంటగా నటిస్తుంది. గతంలో వీరి కాంబోలో సైరా నరసింహారెడ్డి తెరకెక్కింది. మరోసారి ఇద్దరూ జతకట్టారు. చిరు తమన్నా కెమిస్ట్రీ, సాంగ్స్ ఫ్యాన్స్ ని అలరించడం ఖాయం. ఇక మెహర్ రమేష్ చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టారు. ఫార్మ్ లో లేకపోయినా చిరంజీవి పిలిచి అవకాశం ఇచ్చారు. కసితో భోళా శంకర్ తెరకెక్కించిన మెహర్ రమేష్ హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.

Exit mobile version