https://oktelugu.com/

Bangarraju: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది.. ‘వాసి వాడి తస్సదియ్యా’..!

Bangarraju Trailer: అక్కినేని నాగార్జున-నాగచైతన్య కాంబోలో తెరకెక్కిన  ‘బంగార్రాజు’ మూవీ జనవరి 14న థియేటర్లలో రిలీజు కానుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్రబృందం ఇప్పటికే ప్రత్యేకం చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా జరుపుకున్న ‘బంగార్రాజు’ విడుదలకు ముందు రూ.39కోట్ల భారీ బిజినెస్ చేసింది. నాగార్జున కెరీర్లో ఈ సినిమానే హయ్యెస్ట్ బిజినెస్ చేసిన మూవీగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘బంగార్రాజు’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకర్స్ తాజాగా ట్రైలర్స్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 11, 2022 / 06:25 PM IST
    Follow us on

    Bangarraju Trailer: అక్కినేని నాగార్జున-నాగచైతన్య కాంబోలో తెరకెక్కిన  ‘బంగార్రాజు’ మూవీ జనవరి 14న థియేటర్లలో రిలీజు కానుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్రబృందం ఇప్పటికే ప్రత్యేకం చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా జరుపుకున్న ‘బంగార్రాజు’ విడుదలకు ముందు రూ.39కోట్ల భారీ బిజినెస్ చేసింది. నాగార్జున కెరీర్లో ఈ సినిమానే హయ్యెస్ట్ బిజినెస్ చేసిన మూవీగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    ‘బంగార్రాజు’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకర్స్ తాజాగా ట్రైలర్స్ ను రిలీజు చేశారు. ‘పంచె కట్టుతో.. బుల్లెట్ మీద.. కళ్లజోడు పెట్టుకొని.. కర్ర తిప్పుతూ మన బంగార్రాజు వస్తోంటే ‘వాసి వాడి తస్సదియ్యా’.. పాపలు క్యూ కట్టాల్సిందే’ అన్నట్లు దర్శకుడు కల్యాణ్ క్రిష్ణ కురసాల ట్రైలర్లో చూపించాడు. ‘సొగ్గాడు చిన్నినాయనా’ను మరిపించేలా ఈ సినిమాపై హైప్ ను ఆయన క్రియేట్ చేశారు.

    పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ‘బంగార్రాజు’ మూవీలో నాగ్, చైతులు పంచె కట్టు, యాస, మ్యానరిజంతో ఆకట్టుకున్నారు. బుల్లెట్టు బండి, కళ్లజోడు, పంచె కట్టులతో తండ్రి కొడుకులు పోటీపడి నటించారు.  కుర్ర హీరోయిన్ కృతిశెట్టి(బేబమ్మ) సైతం సర్పంచ్ గా పోటీ చేస్తూ కామెడీని పండించడం ఆకట్టుకుంది. ఈ మూవీలో చాలామంది అమ్మాయిలు ఉండటంతో రోమాన్స్ కు కొదవలేదని తెలుస్తోంది.

    ‘సొగ్గాడు చిన్ననాయనా’లో నాగ్ రోమాన్స్ చేస్తే.. ‘బంగార్రాజు’లో మాత్రం నాగచైతన్యకు ఆ అవకాశం దక్కినట్లు కన్పిస్తోంది. ట్రైలర్ ను చూస్తే బంగార్రాజు రోమాన్స్ సీన్లలో రెచ్చిపోయినట్లు అర్థవుతోంది. ఇక ట్రైలర్లో  సీనియర్ హీరోయిన రమ్యకృష్ణ, మెగా బ్రదర్ నాగబాబు, రావు రమేష్ తదితరులు తళుక్కున మెరిశారు.

    ఈ ట్రైలర్ చూస్తుంటే.. ‘బంగార్రాజు’ ఈ సంక్రాంతికి హిట్టుకొట్టడం ఖాయంగా కన్పిస్తోంది. ఇక ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందించాడు. రెండు నిమిషాల ఆరుసెకన్ల నిడివితో విడుదలైన ‘బంగార్రాజు’ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ అక్కినేని ఫ్యాన్స్ ను అలరిస్తోంది.