Mokshagna: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు పోటీనిస్తున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ.. ఎందులో తెలుసా..?

ఒకప్పుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అయితే ఎలా స్లిమ్ గా ఉండేవారో వాళ్లకి ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం మోక్షజ్ఞ కూడా అలాగే కనిపిస్తుండడంతో నందమూరి అభిమానులు అందరూ సంతోషపడుతున్నారు.

Written By: Gopi, Updated On : February 18, 2024 1:26 pm

Mokshagna

Follow us on

Mokshagna: నందమూరి నటసింహం గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రి లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోలుగా కళ్యాణ్ రామ్, ఎన్టీయార్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ చాలా సంవత్సరాల నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.చాలా సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య బాబు అభిమానులకు తెలియజేసినప్పటికీ అనుకోని కారణాలవల్ల ఆయన ఎంట్రీ అనేది డిలే అవుతూ వస్తుంది. ఇక కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ బాడీ చూస్తే షేప్ అవుట్ అయిపోయినట్టుగా కనిపించారు. ఇక నందమూరి అభిమానులు అందరూ మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం కష్టమే అని అనుకున్నారు కానీ వాళ్ళందరి ఊహలని తల కిందులు చేస్తూ ఇప్పుడు ఆయన చాలా స్లిమ్ గా తయారయ్యాడు.

ఒకప్పుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అయితే ఎలా స్లిమ్ గా ఉండేవారో వాళ్లకి ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం మోక్షజ్ఞ కూడా అలాగే కనిపిస్తుండడంతో నందమూరి అభిమానులు అందరూ సంతోషపడుతున్నారు. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరం ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో నందమూరి ఫ్యామిలీ నుంచి మరొకసారి హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ బ్లాక్ షర్ట్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ గా మారింది.

ఇక ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఎన్టీఆర్ కంటే స్టార్ హీరోగా మారతాడా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మోక్షజ్ఞ ఫిట్నెస్ చూస్తుంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడం పక్కా అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి…