https://oktelugu.com/

Akhanda Telugu Movie Review : ‘అఖండ’ మూవీ రివ్యూ

Akhanda Telugu Movie Review నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, అవినాష్, పూర్ణ, సుబ్బరాజు తదితరులు. దర్శకత్వం : బోయపాటి శ్రీను నిర్మాతలు: మిర్యాల రవీందర్‌రెడ్డి, సంగీత దర్శకుడు: త‌మన్‌ ఎస్‌‌‌, సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు రేటింగ్ : 3.25/5 తెలుగు సినీ కళామతల్లి తన ఉనికి కోసం భయంతో బిక్కుబిక్కుమంటూ ఆశగా ఎదురుచూస్తున్న సమయం ఇది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఆ తల్లి పురుటి నొప్పుల […]

Written By:
  • Shiva
  • , Updated On : December 2, 2021 5:37 pm
    Follow us on

    Akhanda Telugu Movie Review
    నటీనటులు:
    నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, అవినాష్, పూర్ణ, సుబ్బరాజు తదితరులు.
    దర్శకత్వం : బోయపాటి శ్రీను
    నిర్మాతలు: మిర్యాల రవీందర్‌రెడ్డి,
    సంగీత దర్శకుడు: త‌మన్‌ ఎస్‌‌‌,
    సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌,
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    రేటింగ్ : 3.25/5

    Akhanda Telugu Movie Review

    Akhanda Telugu Movie Review

    తెలుగు సినీ కళామతల్లి తన ఉనికి కోసం భయంతో బిక్కుబిక్కుమంటూ ఆశగా ఎదురుచూస్తున్న సమయం ఇది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఆ తల్లి పురుటి నొప్పుల బాధను తీర్చే బాధ్యతను ‘అఖండ’ తన తలకెత్తుకున్నాడు. అసలుకే బాలయ్య సినిమాలకు ఓపెనింగ్స్ రావు అని, ఆయన గత సినిమాల అనుభవం చెబుతుంది. ఇలాంటి ఎన్నో అనుమానాలు, అపోహల మధ్యన వచ్చిన ‘అఖండ’ పరిస్థితి ఏమిటో రివ్యూ లోకి వెళ్లి చూద్దాం.

    కథ :

    అనంతపురంలో మురళీ కృష్ణ(బాలకృష్ణ)కి మంచి మనిషిగా పేరు ఉంది. ఆ పేరుకి తగ్గట్టే మృగాల్లా మారిన అక్కడ మనుషుల్లో మార్పు తెస్తాడు. అయితే అదే ప్రాంతంలో వరద రాజులు(శ్రీకాంత్) ఎన్నో దుర్మార్గులు చేస్తూ పేద ప్రజలను చంపుకుంటూ వెళ్తాడు. దాంతో మురళీ కృష్ణ వరదరాజులుకు అడ్డుగా వెళ్తాడు. దాంతో మురళీకృష్ణ పై బాంబ్ బ్లాస్ట్ నేరం మోపి అరెస్ట్ చేయిస్తాడు వరదరాజులు, అతను వెనుక ఉన్న ఓ బలమైన వ్యక్తి (మెయిన్ విలన్). అలాగే మురళీకృష్ణ ఫ్యామిలీని చంపడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అఘోర అఖండగా ఎంటర్ ఇస్తాడు మరో బాలయ్య. ఇక ఆ క్షణం నుంచి ‘అఖండ’ అఖండ జ్యోతి మొదలవుతుంది. మరి ఈ అఖండ ఏమి చేశాడు ? అన్యాయాలను ఎలా అరికట్టాడు ? ఇంతకీ మురళీ కృష్ణకి, అఖండకి మధ్య సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

    విశ్లేషణ :
    అఖండతో అఖండ మైన విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. బాలయ్య సినిమా అంటే.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తాయని దాదాపు మర్చిపోయిన సమయంలో.. ఏకంగా థియటర్స్ దగ్గర జన సమూహమే కనబడింది. పైగా మల్టీప్లెక్స్ ల దగ్గర కూడా. ఉదాహరణకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ లో అయితే బాహుబలి 2 కూడా ఎంతమంది జనం అయితే వచ్చారో.. అఖండకు అంతకంటే ఎక్కువ వచ్చారు. ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు ఆ స్థాయిలో జనం పోటెత్తారు.

    నిజానికి ఆ స్థాయిలో జనం వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. పార్కింగ్ ఏరియా మొత్తం నిండిపోయి.. ప్రసాద్స్ ముందు ఉన్న రోడ్డు ఇరువైపుల బళ్ళు పెట్టారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు. అఖండ అఖండమైన విజయం సాధించిందని. అందుకే.. సినిమాలో ఏముంది ? ఏమి మిస్ అయింది ? లాంటి విశేషణాలు విశ్లేషణల జోలికి ఇప్పుడు వెళ్లడం లేదు.

    కాకపోతే సినిమా గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. పక్కా యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో బాలయ్య మార్క్ మాస్ అదిరిపోయింది. బాలయ్య తన నట విశ్వరూపంతో చేసిన విళయతాండవం ఒక వైపు.. శివనామస్మరణలతో బాలయ్య శివతాండవం మరో వైపు.. అందుకే.. అఖండ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన సినిమాగా నిలిచింది.

    ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బలంగానే ఉన్నాయి. అలాగే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, మరియు క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ అద్భుతం. అలాగే పూర్ణ ట్రాక్, బాలయ్య డాన్స్, డైలాగ్స్ వంటి అంశాలు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

    ప్లస్ పాయింట్స్ :

    బాలయ్య నటన,
    మెయిన్ పాయింట్, కథలోని మలుపులు,
    యాక్షన్ సన్నివేశాలు,
    తమన్ సంగీతం,
    సినిమాలో చెప్పిన మెసేజ్,

    Also Read: Acharya: త్వరలోనే ‘ఆచార్య’ నుంచి రెండు పెద్ద సర్​ప్రైజ్​లు

    మైనస్ పాయింట్స్ :

    బోయపాటి ఓవర్ యాక్షన్,
    ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా సాగడం,

    సినిమా చూడాలా ? వద్దా ? :

    కచ్చితంగా చూడొచ్చు. ముందు చెప్పుకున్నట్టుగానే.. బాలయ్య తన నట విశ్వరూపంతో చేసిన రౌద్ర విళయతాండవం, మరియు శివనామస్మరణలతో చేసిన శివతాండవం అద్భుతం.

    Also Read: Akhanda: థియేటర్​లో బాలయ్య ఫ్యాన్స్​కు షాక్​.. ‘అఖండ’ సినిమా ఆపేసి పోలీసులు వార్నింగ్​

    Tags