Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ కి సర్వం సిద్దం చేసిన బాలయ్య…డైరెక్టర్ ఎవరంటే..?

బాలయ్య బాబు తర్వాత తన నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే హీరో మోక్షజ్ఞ అని అందరూ అనుకుంటున్నారు కానీ తను ఇంకా సినిమాలకి ఎంట్రీ కూడా ఇవ్వకపోవడంతో అసలు బాలయ్య బాబు మోక్షజ్ఞ ని ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా, లేదా అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Written By: Gopi, Updated On : December 2, 2023 8:50 am

Mokshagna

Follow us on

Mokshagna: చాలామంది పెద్ద హీరోల కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ముందుకు దూసుకుపోతున్న క్రమంలో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు కొడుకు అయినా మోక్షజ్ఞ అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు చిరంజీవి కొడుకు అయిన రాంచరణ్, నాగార్జున కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికీ బాలయ్య బాబు కొడుకు మాత్రం ఇంకా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం లేదు ఈ విషయంలో నందమూరి అభిమానులు తీవ్రమైన నిరాశని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు అంటే బాలయ్య బాబు తర్వాత తన నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే హీరో మోక్షజ్ఞ అని అందరూ అనుకుంటున్నారు కానీ తను ఇంకా సినిమాలకి ఎంట్రీ కూడా ఇవ్వకపోవడంతో అసలు బాలయ్య బాబు మోక్షజ్ఞ ని ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా, లేదా అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రీసెంట్ గా మోక్షజ్ఞ పిక్స్ చూస్తే ఒక హీరో మెటీరియల్ ఎలాగైతే ఉండాలో అలా ఉంటూనే చాలా క్యూట్ గా తయారయ్యాడు. ఇక ఇదే ఊపులో అతన్ని సినిమాల్లోకి దింపాలని బాలయ్య బాబు చూస్తున్నాడు. 2024లో ఎలాగైనా తన నుంచి ఒక సినిమా రిలీజ్ చేసే ఉద్దేశ్యం తో బాలయ్య బాబు ప్రీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే బాలయ్య బాబు మోక్షజ్ఞ ని ఎవరి డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ చేయించాలి అనే దాని మీదనే చాలా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఎందుకంటే నాగార్జున వారసులైన నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా స్టార్ హీరోలు గా మారడంలో ఫెయిల్ అయ్యారు. అందుకే మోక్షజ్ఞ విషయంలో అలాంటిది జరగకుండా ఉండడానికి బాలయ్య బాబు ముందు నుంచే చాలామంది డైరెక్టర్లు చెప్పే కథలు వింటూ ఎలాగైనా మొదటి సినిమాతో సక్సెస్ సాధిస్తేనే తన కొడుకుకి స్టార్ హీరో అయ్యే రేంజ్ దక్కుతుందని భావిస్తున్నాడు. కాబట్టే కథలు వింటూ దాంట్లో లోటుపాట్లను తెలుసుకుంటూ తెర మీదికి తీసుకురావాలి అనే ఆలోచనలోనే బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తుంది…

అయితే మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతిలో పెడతారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు బోయపాటి కాకుండా మరో డైరెక్టర్ తో బాలయ్య బాబు మోక్షజ్ఞ ను ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పటివరకు సస్పెన్స్ గా మారింది ఇంక తొందరలోనే ఆ సస్పెన్స్ కి తెర దించనున్నట్టుగా నందమూరి అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…