Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ క్యారెక్టర్ గురించి, ముఖ్యంగా ఆయన మనసు గురించి తెలిసిన వారంతా చెప్పే మాట, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అని. ఎప్పుడు ఓపెన్ గా ఉంటారని, స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో ఉంటారని ఇలా బాలయ్య గురించి గొప్పగా చెబుతుంటారు. బాలయ్య గురించి గిట్టని వాళ్ళు కూడా మంచి మాటలే చెబుతారు.

నిజంగానే తనది మంచి మనసు అని, తనది గొప్ప వ్యక్తిత్వం అని బాలయ్య మరోసారి ఘనంగా చాటుకున్నారు. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ అనే షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ లో అజీజ్ అనే కుర్రాడు, తన సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం చదువు మానేసి.. పని చేస్తున్నాడు. తన అక్కయ్య ను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ కుర్రాడు కూలీ పని చేయడం బాలయ్యను కదిలించింది.
ఫస్ట్ ఎపిసోడ్ లో అజీజ్ స్టోరీ మొత్తం తెలుసుకున్న బాలయ్య అజీజ్ సోదరి బేగంకు తన బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తానని మాట ఇచ్చాడు. కాగా తాజాగా బాలయ్య తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ చిన్నారి బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మొదలైంది. పేరు కోసం పబ్లిక్ గా మాట ఇచ్చి ఆ తర్వాత ఎప్పటికో అరకొర సాయం చేసే లోకం ఇది.
అలాంటిది మాట ఇచ్చిన ఒక్క రోజులోనే ఆ మాటను నిలబెట్టుకుని ఒక కుటుంబాన్ని ఆదుకోవడం అంటే.. గ్రేటే. అయినా పేదవాళ్ల ప్రాణం కాపాడటం కోసం బాలయ్య ఇప్పటికే బసవతారకం ఆసుపత్రి తరుపున ఎంతో సేవ చేస్తున్నాడు. అందుకే, బాలయ్య సేవకు పలువురి ప్రశంసలందిస్తున్నారు. అయినా బాలయ్య బాబుకు సేవా కార్యక్రమాలు అలవాటు అయిపోయాయి.
Also Read: Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు దక్కిన అరుదైన గౌరవం…
ఏ విపత్తు వచ్చినా ఎప్పటికప్పుడు తన సేవను ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఇప్పటికీ ఎంతో మందికి మేలు చేస్తూ తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. అందుకే బాలయ్య బాబు ఆయన అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. తాజాగా అన్‌స్టాపబుల్ షో ద్వారా ఈ విషయం మళ్ళీ రుజువు అయింది.
Also Read: Radhe Shyam: రాధేశ్యామ్లో ఆ ఒక్క సీన్ తీయడానికి సంవత్సరం పట్టిందట!