
Balakrishna: నటసింహం బాలయ్య ( Balayya) – షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఇప్పటికే రంగం సిద్ధం అయింది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 21వ తేదీ నుండి మొదలు కానుంది. ఇక అఖండ సినిమా కూడా దాదాపు పూర్తీ అయ్యే స్టేజిలో ఉంది. ఈ సినిమా టీజర్ భారీ వ్యూస్ తో కొత్త రికార్డు క్రియేట్ చేయడంతో బాలయ్య క్రేజ్ పెరిగింది.
నిజానికి అఖండ సినిమా సోషల్ మీడియాను షేక్ చేసింది. అసలు బాలయ్యకి ఇంకా ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అంటూ ఫ్యాన్సే షాక్ అయ్యేలా ఏకంగా 70 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. దాంతో బాలయ్యకు డిమాండ్ పెరిగింది. టాలెంటెడ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ లిస్టులో ప్రశాంత్ వర్మతో పాటు దర్శకుడు శ్రీవాసు, అలాగే వక్కంతం వంశీ కూడా బాలయ్య కోసం కథలు రెడీ చేశారు. ఇక అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ తరువాత బాలయ్యతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్నట్టు మైత్రీతో పాటు అశ్వినీదత్, మరియు దిల్ రాజు కూడా బాలయ్యతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.
మరోపక్క బాలయ్య కోసం సితార సంస్థ కథలు వింటుంది. కొత్త నేపథ్యంలో సినిమా చేయాలని సితార సంస్థ టార్గెట్. అలాగే పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ సరికొత్త కథ కోసం కూడా సితార వెతుకుతుంది. ఏది ఏమైనా సరైన సినిమా పడితే.. రికార్డ్స్ ను బ్రేక్ చేయగల సత్తా బాలయ్యలో ఇంకా ఉంది.