Homeఎంటర్టైన్మెంట్బిగ్ బాస్ : అరియానా ఎమోషన్ మాములుగా లేదుగా !

బిగ్ బాస్ : అరియానా ఎమోషన్ మాములుగా లేదుగా !

Ariyana Glory
బిగ్ బాస్ షోలో ప్రస్తుతం రేస్ టు ఫినాలె అనే టాస్క్ జరుగుతుండటంతో పోటీ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో గేమ్ రకరకాలుగా మలుపులు తిరుగుతూ సాగడంతో హౌస్ మేట్స్ మధ్య డ్రామా పీక్ లో ఉంది. అయితే ఇప్పటివరకూ సోహెల్, అఖిల్ కలిసికట్టుగా ఆడి చివరి స్టేజ్ వరకు వచ్చారు. వీరిద్దరికీ ఎవరి ఆట వారే ఆడాలని బిగ్ బాస్ చెప్పినా కూడా మొత్తానికి ఒకరికి ఒకరు కలిసి కట్టుగానే ఆడుతూ వస్తున్నారు. ఇదే విషయంపై బిగ్ బాస్ హెచ్చరించినా.. మనోళ్లు మాత్రం తెలివిగానే ముందుకు పోతున్నారు. కాగా రెండో లెవెల్‌లోకి వచ్చిన అఖిల్ సోహెల్ హారిక అభిజిత్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

Also Read: ‘సలార్’గా రాబోతున్న ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ..!

గార్డెన్ ఏరియాలో ఉన్న మడ్ పిట్‌లో పూలను నాటాలని.. ఎవరు తక్కువ పూలను నాటితే వారు ఆట నుంచి తప్పుకున్నట్టేనని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. కాగా ఎప్పటిలాగే ఈ ఆటలోనూ అఖిల్, సోహెల్ కలిసి పథకం ప్రకారం ఆడి గెలిచారు. దీనికితోడు రెండో లెవెల్‌ మొదటి బజర్‌కు హారిక ఆట నుంచి తప్పుకోవడం, ఎలాగూ తక్కువ పూలునే సేకరించడంతో హారిక గేమ్ లో ఓడిపోయింది. అయితే ఆమె గేమ్ ఓడిపోవడానికి కారణం.. ఇంట్లో జరిగిన పెద్ద గొడవనట. పై నుంచి వచ్చే పూలు హారికకు దొరకనివ్వకుండా సోహెల్ అడ్డు పడ్డాడట.. చేతుల్లోంచి పూలు లాక్కొవడానికి వీల్లేదన్నాడట.

Also Read: అల్లు అర్జున్ కి మరో ఘనత.. టాప్ క్రేజీ పీపుల్ లిస్ట్ !

అలాగే మడ్ పిట్‌లోంచి దొంగతనం చేయొద్దన్నాడని.. ఇక ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎలా ఆట ఆడాలని హారిక క్వశ్చన్ చేస్తోంది. అయితే మొదట హారిక సోహెల్ వద్ద ఉన్న రెండు పూలను లాక్కుంది.. దాంతో సోహెల్ హారిక వద్దున్న మొత్తం పూలను లాక్కున్నాడు. మొదట ఆమె లాక్కుంది కాబట్టి.. ఇక్కడ సోహెల్ ది కూడా తప్పు అని అనలేం. ఆయినా ఆట మధ్యలో బిగ్ బాస్ ఎవరి ఆట వారే ఆడాలి అని అనౌన్స్ చేసినా.. పట్టించుకోకుండా తమ ఇష్టప్రకారం గేమ్ ఆడి.. గేమ్ లో అన్యాయం జరిగింది అంటే ఎలా ? హారిక బాధ ఇలా ఉంటే… ఆమె బాధను చూసి అరియానా బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేసింది. ఒక్క అమ్మాయి ముగ్గురితో పోటీ పడుతోంది, అయినా వారిద్దరూ కలిసి ఆడుతున్నారని అరియానా కర్తవ్యంలో విజయశాంతి రేంజ్ లో వాపోయింది. మధ్యలో గుండెల్లో బాధగా ఉంది..నొప్పిగా ఉందని మొత్తానికి ఎమోషనల్ గానూ వెరీయేషన్స్ చూపించింది అరియానా. బిగ్ బాస్‌ను అరియానా బాగానే ప్రశ్నించింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular