Homeఎంటర్టైన్మెంట్Anvesh : ఆ యాంకర్ జల్సాలు చేస్తుంది.. యూట్యూబర్ అన్వేష్ మరొక సంచలనం!

Anvesh : ఆ యాంకర్ జల్సాలు చేస్తుంది.. యూట్యూబర్ అన్వేష్ మరొక సంచలనం!

Anvesh : బెట్టింగ్ యాప్స్ మోజులో జనాలు లక్షలు, కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈజీ మనీకి ఆశపడి కొందరు, వ్యసనంతో మరికొందరు బెట్టింగ్ యాప్స్ కి బలి అవుతున్నారు. ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. సెలెబ్రిటీస్ కి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది. దాంతో బుల్లితెర యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ని విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ కారణంగా మరింత మంది బెట్టింగ్ యాప్స్ లో ఆడుతూ డబ్బులు నష్టపోతున్నారు.

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తగదు, అలా చేసే సెలెబ్స్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే పలువురు సెలెబ్స్ విచారణ ఎదుర్కొన్నారు. ఇకపై బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయమని వీడియోలు విడుదల చేశాడు. నటుడు ఆలీ తన భార్యతో పాటు యూట్యూబ్ ఛానల్ లో ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడు. దీనిపై అన్వేష్ మండిపడ్డాడు. తాజాగా అన్వేష్ ఓ యాంకర్ పై ఆరోపణలు చేశాడు.

Also Read : అందువల్లే శివ జ్యోతి కి అంతలా ఆస్తులు.. “నా అన్వేషణ అన్వేష్” సంచలనం..

తీన్మార్ వార్తల ద్వారా పాపులర్ అయిన సావిత్రి అలియాస్ శివ జ్యోతి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించింది అని అన్వేష్ విమర్శలు గుప్పించాడు. ఒకప్పుడు శివ జ్యోతి నెలకు రూ. 8 వేల జీతానికి పని చేసేది. ఇప్పుడు ఆమెకు హైదరాబాద్ లో 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్, లగ్జరీ కారు, సొంతూరిలో హైవే పక్కన 10 ఎకరాల విలువైన స్థలం ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఆమె కోట్లలో సంపాదిస్తుంది. ఈ యాప్స్ వలన జనాలు ప్రాణాలు కోల్పోతుంటే ఆమె విదేశాల్లో భర్తతో జల్సాలు చేస్తుంది. ఇకనైనా జ్యోతి అక్క బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం మానేయాలి, అని అన్వేష్ హితవు పలికాడు.

మరి ఈ ఆరోపణల మీద శివ జ్యోతి ఎలా స్పందిస్తారో చూడాలి. శివ జ్యోతి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. షోలో సత్తా చాటిన శివ జ్యోతి ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ కొద్దిలో మిస్ అయ్యింది. ఆమె ఫినాలేకి ముందు వారం ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం బుల్లితెర మీద శివ జ్యోతి పెద్దగా కనిపించడం లేదు. ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Also Read : ఆలీ దంపతులు మోసం చేశారు, బెట్టింగ్ యాప్స్ వివాదంలో స్టార్ కమెడియన్… యూట్యూబర్ అన్వేష్ సెన్సేషనల్ కామెంట్స్

RELATED ARTICLES

Most Popular