https://oktelugu.com/

Prabhas Anushka Photo Viral: ప్రభాస్ తో అనుష్క ప్రైవేట్ ఫోటో వైరల్

Prabhas Anushka Photo Viral:  ప్రభాస్ పెళ్లి పై మళ్లీ ఓ గాసిప్ వైరల్ గా మారింది. స్వీటీ అనుష్కతో ప్రభాస్ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడని.. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని.. అందుకే వాళ్లిద్దరూ పెళ్లికి దూరంగా ఉంటున్నారని.. ఆ కారణంగానే అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా ప్రభాస్ ప్రేమ కోసం ఎదురుచూస్తుందని ఇలా చాలా రకాలుగా వార్తలు వినిపించాయి. మొత్తానికి మీడియా ‘ప్రభాస్ పెళ్లి’ పై అనేక రూమర్లను […]

Written By:
  • Shiva
  • , Updated On : March 9, 2022 / 12:54 PM IST
    Follow us on

    Prabhas Anushka Photo Viral:  ప్రభాస్ పెళ్లి పై మళ్లీ ఓ గాసిప్ వైరల్ గా మారింది. స్వీటీ అనుష్కతో ప్రభాస్ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడని.. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని.. అందుకే వాళ్లిద్దరూ పెళ్లికి దూరంగా ఉంటున్నారని.. ఆ కారణంగానే అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా ప్రభాస్ ప్రేమ కోసం ఎదురుచూస్తుందని ఇలా చాలా రకాలుగా వార్తలు వినిపించాయి.

    Prabhas Anushka Photo Viral

    మొత్తానికి మీడియా ‘ప్రభాస్ పెళ్లి’ పై అనేక రూమర్లను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అందిస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ప్రభాస్ – అనుష్క పెళ్ళికి రెడీ అయ్యారని.. ‘ప్రభనుష్క’ అనే కొత్త పేరును కూడా వీళ్ళకి తగిలించి ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. పైగా ప్రభాస్ – అనుష్క సాంప్రదాయ దుస్తుల్లో సన్నిహితంగా దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలోకి వదిలారు. ప్రస్తుతం ఈ ఫోటో కూడా బాగా హల్ చల్ చేస్తోంది.

    అసలు ఇంతకీ ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు..? ప్రభాస్ కంటే పదేళ్లు వయసు తక్కువ ఉన్న హీరోలు కూడా ఇప్పటికే పెళ్లి పిల్లలతో హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయ్యారు. ప్రభాస్ మాత్రం ఇంకా సోలో లైఫ్ సో బెటర్ అనే కోణంలోనే లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.

    Prabhas Anushka Photo Viral

    మరో పక్క స్వీటీ అనుష్క ఇరవై ఏళ్ల క్రితమే పెళ్లి ఈడుకొచ్చేసింది. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ‘అనుష్క కూతురు’ కూడా ఈ పాటికి హీరోయిన్ అయి ఉండేది అని సోషల్ మీడియాలో అనుష్క మీద నెటిజన్లు జోక్స్ కూడా పేలుస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ ఇద్దరు ఒక్కటి అవుతారా ? లేక, ఇలాగే గాసిప్ రాయుళ్లకు కంటెంట్ గా మారతారా ? చూడాలి.

    Tags