Anusha Dandekar: మనదేశంలో కూడా పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోంది. సహజీవనం పేరుతో కొన్నాళ్లు కలిసి తిరుగుతున్నారు. తరువాత వదిలేస్తున్నారు. ఇలా విచ్చలవిడితనం వల్ల ఇద్దరికి ఇబ్బందులు తలెత్తుతున్నా ఎవరు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా డేటింగ్ సంస్కృతి రానురాను పెరిగిపోతోంది. ఇది ఉత్తరాది నుంచి మెల్లగా దక్షిణాదికి కూడా పాకుతోంది. దీంతో పెళ్లి కాకుండా కొన్నాళ్లు కలిసి తిరగడం తరువాత వదిలేసుకోవడం పరిపాటిగా మారింది. మన దేశంలో ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కే ఇలాంటి సంప్రదాయం మంచిది కాదని తెలిసినా ఎవరు కూడా లెక్కలోకి తీసుకోవడం లేదు. పర్యవసానంగా సమస్యలే వస్తున్నాయి. కానీ ఈ విష సంస్కృతి మంచిది కాదనే విషయం తెలుసుకుంటే మంచిది.

ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు తమ జీవితాలను నవ్వుల పాలు చేసుకుంటున్నారు. డేటింగ్ పేరుతో ఎవరితోనే తిరగడం తీరా సమయానికి నచ్చలేదని వదిలేయడం అలవాటుగా చేసుకుంటున్నారు. దీంతో జీవితాలను శిథిలం చేసుకుంటున్నారు. ఎంత వేగంగా సహజీవనం చేస్తున్నారో అంతే వేగంగా బ్రేకప్ చెబుతున్నారు. దీంతో జీవితంలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. నూరేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని హాయిగా ఉండక ఏదో సాధించినట్లు డేటింగ్ అంటూ ఓ కొత్త పాశ్చాత్య సంప్రదాయాన్ని పట్టుకుంటున్నారు. ఫలితంగా మోడుగా మిగిలిపోతున్నారు.
Also Read: Chiranjeevi Daughter Sreeja: చిరంజీవి కూతురు ఇలా షాకిచ్చిందేంటి?
బుల్లితెర నటి, యాంకర్, సింగర్ అనూష దండేకర్ గతంలో నటుడు కరణ్ కుంద్రాను ప్రేమించింది. అతడితో డేటింగ్ చేసింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. కానీ చివరికి బ్రేకప్ చెప్పింది. తరువాత మోడల్ జాసన్ షాతో కలిసింది వారు పెళ్లి చేసుకుంటారని అందరు అనుకున్నారు. వారు కూడా అదే తీరుగా తిరిగారు. కానీ ఏమైందో ఏమో కానీ వారి మధ్య కూడా సయోధ్య కుదరలేదు. దీంతో విడిపోయారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇద్దరితో విడిపోయాక ఇప్పుడు తల్లయింది. తల్లయిందంటే భర్తతో కాదు పాపను దత్తత తీసుకుని. ఓ చిన్న పాపను దత్తత తీసుకుని తన మాతృత్వాన్ని చాటుతోంది. ఆమెకు సహారా అని పేరు పెట్టింది. ఏంజెల్ సహారా ఇప్పుడు నా సొంతం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. సామాజిక మాధ్యమాల్లో బేబికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటోంది. తనను తల్లిని చేసిన పాపను ముద్దాడుతూ ముచ్చట పడుతోంది. మొత్తానికి ఎలాగైతేనేమి తానో తల్లి మాత్రం అయింది.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముందు ‘3 ఆప్షన్లు’.. ఏపీలో అధికారం సాధ్యమేనా?
Recommended Videos
[…] […]