Prabhas: ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నాడు. అందుకే ఏ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్లు అయిన కూడా ప్రభాస్ తో ఒక్క సినిమా అయిన చేయాలని చాలా కుతుహలంతో ఉన్నారు. అందుకే ప్రతి డైరెక్టర్ ప్రభాస్ కు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ తో ఒక కథను రెడీ చేసుకొని ప్రభాస్ కోసం విపరీతంగా తిరుగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కూడా ఎవరితో సినిమా చేయాలి ఎవరితో చేయకూడదనే విధంగా ఆలోచన చేస్తూ ముందుకు కదులుతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఓం రావత్ దర్శకత్వంలో చేసిన అది పురుషు సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక అప్పటినుంచి ప్రభాస్ ఏ డైరెక్టర్ ని కూడా పెద్దగా నమ్మడం లేదు. అందుకే ముందుగా కథ విని ఆ కథ నచ్చితే ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇదే క్రమం లో తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన విష్ణువర్ధన్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది…
ఇక విష్ణువర్ధన్ తెలుగులో ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పంజా సినిమాని డైరెక్షన్ చేశాడు ఇక ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా తర్వాత తమిళంలో అజిత్ తో చేసిన సినిమా ఒకటి ఆట ఆరంభం గా తెలుగులో డబ్ అయింది.ఆ సినిమాలో రానా కూడా ఒక కీలకపాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక తెలుగులో కూడా మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా తో విష్ణువర్ధన్ తెలుగులో కూడా ఒక మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఇక ఇప్పుడు తన దగ్గర ఒక మంచి కథ ఉండడంతో అది ప్రభాస్ కి ఐతే బాగుంటుందని అనుకొని ఆయనకి కథ వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దాని మీద ప్రభాస్ ఎలా స్పందించాడు అనేది క్లారిటీ లేదు కానీ విష్ణు వర్ధన్ మాత్రం స్టైలిష్ డైరెక్టర్ గా తమిళ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు అయితే పొందాడు.
ఇక ఇప్పటికే ఆయన అజిత్ తో తమిళంలో బిల్లా అనే సినిమా చేశాడు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు మరి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనే విషయం మీదనే ఇప్పుడు విష్ణువర్ధన్ సినిమా అనేది ఆధారపడి ఉంది…