https://oktelugu.com/

Priyanka Jawalkar: ప్చ్.. కరోనా బారిన పడిన మరో హీరోయిన్ !

Priyanka Jawalkar:  క‌రోనా ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. కాగా కరోనా బారిన పడుతున్న , హీరోయిన్ల లిస్ట్ లో చేరింది ప్రియాంక జ‌వాల్క‌ర్. త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు ఆమె వెల్ల‌డిస్తూ.. ‘నేను ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను, అయినప్ప‌టికీ నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచ‌న మేర‌కు ప్ర‌స్తుతం స్వీయ‌నిర్బంధంలో ఉంటూ చాలా జాగ్రత్తగా నా ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ పెట్టాను. ఇక దయచేసి ఈ మ‌ధ్య‌కాలంలో న‌న్ను క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 20, 2022 / 01:52 PM IST
    Follow us on

    Priyanka Jawalkar:  క‌రోనా ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. కాగా కరోనా బారిన పడుతున్న , హీరోయిన్ల లిస్ట్ లో చేరింది ప్రియాంక జ‌వాల్క‌ర్. త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు ఆమె వెల్ల‌డిస్తూ.. ‘నేను ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను, అయినప్ప‌టికీ నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచ‌న మేర‌కు ప్ర‌స్తుతం స్వీయ‌నిర్బంధంలో ఉంటూ చాలా జాగ్రత్తగా నా ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ పెట్టాను. ఇక దయచేసి ఈ మ‌ధ్య‌కాలంలో న‌న్ను క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.

    Priyanka Jawalkar

    పనిలో పనిగా ఈ బ్యూటీ ఒక చిన్న సలహా కూడా ఇచ్చింది. అంద‌రూ మాస్కులు ధ‌రించండి. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప‌ అన‌వ‌స‌రంగా బ‌య‌ట తిర‌గ‌కండి. జాగ్ర‌త్త‌గా ఉండండి’ అంటూ
    తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చెప్పుకొచ్చింది. టాక్సీవాలా సినిమాతో నేను ఉన్నాను అంటూ హీరోయిన్ గా పరిచయం అయింది. పైగా ప్రియాంక జ‌వాల్క‌ర్ లో మంచి అభినయం ఉంది. ఇక అందం ఉంది కాబట్టే ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ హీరోయిన్ గా మాత్రం స్టార్ డమ్ సంపాదించలేకపోయింది. చివరకు ఇలా కరోనా బాధితురాలిగా వార్తలకెక్కింది.

    Also Read:  లైకా’తో బన్నీ పాన్ ఇండియా సినిమా !

    కాగా ప్రియాంక జవాల్కర్ తాజాగా ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’, ‘తిమ్మరుసు’, ‘గ‌మ‌నం’ లాంటి చిత్రాల‌లో నటించింది. ఎలాగూ అవి ప్లాప్ అయ్యాయి కాబట్టి.. అమ్మడును ఎవరూ పట్టించుకోలేదు. ఏది ఏమైనా ఈ కరోనా మాత్రం ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న, శోభన ఇలా అందరూ కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి.

    Also Read: వారానికో నేత‌ను చేర్చుకుంటారంట‌.. వారిపైనే చంద్ర‌బాబు ఆశ‌లు..

    Tags