Anchor Lasya: యాంకర్ లాస్య అనారోగ్యం బారిన పడ్డారు. ఆమె ఆసుపత్రి బెడ్ పై అపస్మారక స్థితిలో కనిపించించారు. ఆమెకు ఏమయ్యిందో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త మంజునాథ్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా తెలియజేశారు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో యాంకర్ రవితో కలిసి లాస్య అనేక టెలివిజన్ షోస్ చేశారు. అప్పట్లో వీరు ప్రేమించుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. అలాగే ఇద్దరికీ గొడవలయ్యాయనే కథనాలు వెలువడ్డాయి.

అయితే లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో చాలా కాలం పేరెంట్స్ కి దూరంగా లాస్య భర్తతో ఉన్నారు. వీరికి జున్ను అనే అబ్బాయి ఉన్నాడు. పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు దగ్గరైనట్లు లాస్య వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయాలు లాస్య బిగ్ బాస్ హౌస్ లో వెల్లడించారు.
బిగ్ బాస్ సీజన్ 4 లో లాస్య పాల్గొన్నారు. ఆ సీజన్ విన్నర్ అభిజీత్ టీమ్ లో లాస్య ఒకరిగా ఉండేవారు. బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్స్ సాధారణం. బిగ్ బాస్ 4 లో అభిజీత్, లాస్య, హారిక, సింగర్ నోయల్ ఒక టీం గా మెలిగేవారు. ఇక హౌస్ లో ఉన్నంత కాలం లాస్య కంటెస్టెంట్స్ కి రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది. సేఫ్ గేమ్ ఆడే లాస్య నవ్వు కూడా ఫేక్ అని హోస్ట్ నాగార్జున అనేవాడు. కాగా ఫైనల్ కి వెళుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు, కానీ అది జరగలేదు.

కొన్నాళ్లుగా బుల్లితెరకు కూడా దూరమయ్యారు. హౌస్ నుండి వచ్చాక తన యూట్యూబ్ ఛానల్ ని చూసుకుంటున్నారు. ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. భర్త, కొడుకుతో హ్యాపీగా ఉంటున్న లాస్యకు ఏమైందో అర్థం కావడం లేదు. ఆమె ఆసుపత్రి బెడ్ పై ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న లాస్యకు ఏమైందో తెలియడం లేదు. భర్త మంజునాథ్ ఆ వీడియో పోస్ట్ చేసి, గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్ పెట్టాడు. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని విషెస్ తెలియజేస్తున్నారు.