Anchor Anasuya Bhardwaj : తల్లి కానున్న అనసూయ… షాక్ అవుతున్న జనాలు!

ఒక్కోసారి అనసూయ కామెంట్స్, సోషల్ మీడియా పోస్ట్స్ కాంట్రవర్సీ కి దారితీస్తూ ఉంటాయి. ఇక నటిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది.

Written By: NARESH, Updated On : February 3, 2024 7:54 pm
Follow us on

Anchor Anasuya Bhardwaj : బుల్లితెర యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్, పాపులారిటీ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె తల్లి కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మళ్ళీ తల్లి కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏంటంటే .. అనసూయ ఓ టాలీవుడ్ స్టార్ హీరోకి సినిమాలో తల్లిగా నటించబోతుందట. ఆ హీరో చిన్నప్పటి పాత్రకు తల్లిగా చేస్తుందట. యంగ్ హీరో డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కు తల్లిగా నటించనుందట. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ పండించనుందట. ఈ కధ మొత్తం అమ్మ సెంటిమెంట్ ను బేస్ చేసుకుని ఉంటుందని సమాచారం. ఇక అమ్మ గొప్పతనం గురించి తెలియజేసే పాత్ర కావడంతో అనసూయ ఓకే చెప్పిందట.

కాగా ఆమె ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. యాంకరింగ్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి సినిమాలు పై దృష్టి పెట్టింది. స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తుంది. ఇటీవల విమానం చిత్రంలో ఓ బోల్డ్ పాత్రలో మెప్పించింది. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సినిమాతో పాటు మరి కొన్ని తెలుగు సినిమాలు చేస్తుంది. ఇక ఈమెకి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అనసూయ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఆమె వేసుకునే దుస్తుల పై విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటూ ఉంటుంది. అయినప్పటికీ మరింత హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ట్రోలర్స్ ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. ఒక్కోసారి అనసూయ కామెంట్స్, సోషల్ మీడియా పోస్ట్స్ కాంట్రవర్సీ కి దారితీస్తూ ఉంటాయి. ఇక నటిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది.