Ugram- Rama Banam: నేడు మ్యాచో స్టార్ గోపీచంద్ హీరో గా నటించిన ‘రామబాణం’ మరియు అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘ఉగ్రం’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల్లో ‘ఉగ్రం’ చిత్రానికి కాస్త పాజిటివ్ టాక్ రాగా, ‘రామబాణం’ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది.వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న గోపీచంద్ కెరీర్ లో మరో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిపోయింది ‘రామబాణం’ చిత్రం.
అయితే సినిమా ఎలా ఉన్నా కూడా గోపీచంద్ కి ఉన్న మాస్ హీరో ఇమేజి వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చేవి.కానీ ఈ చిత్రానికి అది కూడా లేదు, విడుదలకు ముందు ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ‘రామబాణం’ కంటే ఎక్కువ గ్రాస్ ‘ఉగ్రం’ చిత్రానికే ఉన్నాయి. ఇక విడుదల తర్వాత కూడా ఇదే పరిస్థితి, ఉగ్రం చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ దక్కగా, రామబాణం చిత్రానికి కనీస స్థాయిలో కూడా లేవు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ‘ఉగ్రం’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ ఓపెనింగ్ ని రాబట్టే సూచనలు ఉండగా, ‘రామబాణం’ చిత్రానికి కేవలం కోటి 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది.ఒకప్పుడు గోపీచంద్ మార్కెట్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది.కానీ ఇప్పుడు అల్లరి నరేష్ మార్కెట్ కంటే తక్కువకి పడిపోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
ఒకే రకమైన మూస సినిమాలు చేస్తుండడం వల్లే గోపీచంద్ కెరీర్ ఇలా డౌన్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.ఇలాగే కొనసాగితే ఇక గోపీచంద్ తో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు కూడా దొరకరని, అప్పుడు మళ్ళీ ఆయన విలన్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వాల్సిందే అని అంటున్నారు నెటిజెన్స్.మరి గోపీచంద్ తన పంథా ని మార్చుకొని సక్సెస్ లు సాధిస్తాడా లేదా అనేది చూడాలి.