https://oktelugu.com/

Akhil Akkineni : సడెన్ గా షాకిచ్చిన నాగార్జున.. సైలెంట్ గా అక్కినేని అఖిల్ నిశ్చిత్తార్థం.. అమ్మాయి ఎవరో తెలుసా? అస్సలు ఊహించరు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో ఎనలేని సేవలను అందించారు. అలాగే ప్రేక్షకుల్లో అక్కినేని కుటుంబానికి ఒక స్థాయి హోదానైతే ఇచ్చాడు. ఇక ఆయన తర్వాత నాగార్జున కూడా అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను మోస్తూ వస్తున్నాడు.ఇక మూడోవ తరం అక్కినేని వారసులుగా వచ్చిన నాగార్జున కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ కూడా సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 26, 2024 / 06:54 PM IST

    Akhil Akkineni

    Follow us on

    Akhil Akkineni : ఇక ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం అయితే నెలకొంది… నాగార్జున చిన్న కొడుకు అయిన అఖిల్ కొత్త సినిమా కబుర్లు చెబుతాడని అనుకుంటే నాగార్జున మాత్రం సడన్ సర్ప్రైజ్ ఇస్తూ తన కొడుకు అయిన అఖిల్ కి జైనబ్ రవ్జీ తో ఎంగేజ్ మెంట్ అయిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నాడు… ఇక జైనబ్ రవ్జీ తన ఇంటి కోడలు కాబోతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పెద్దల సమక్షంలోనే అఖిల్ జైనబ్ కి తొందరలోనే పెళ్లి కూడా జరగబోతుందనే విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకున్నారు…ఇక గత కొద్ది రోజుల నుంచి అక్కినేని ఫ్యామిలీలో పెద్దగా సంతోషమైన వాతావరణం అయితే కనిపించడం లేదు. కానీ నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీలో కొంతవరకు జోష్ అయితే పెరిగింది. ఇక వచ్చే నెలలో 4 వ తేదీన నాగ చైతన్య శోభిత ల పెళ్లి ఉన్న సందర్భంగా ఇప్పుడు మరొక సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన నాగార్జున యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడనే చెప్పాలి…

    ఇక ఇంతకీ జైనబ్ రవ్జి ఎవరు అంటే ఆమె ఒక థియేటర్ ఆర్టిస్ట్…ఇక తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా కొనసాగుతుంది. ఇక ఆమె ఇప్పటికే దుబాయ్, లండన్ లలో ఆర్టిస్ట్ గా రాణించారు.

    గత రెండు మూడు సంవత్సరాల నుంచి అఖిల్ కి జైనబ్ కి మధ్య మంచి స్నేహ పూర్వకమైన సంబంధమైతే ఏర్పడింది. దాంతో వీళ్ళ మధ్య కుదిరిన బాండింగ్ ని తెలుసుకున్న నాగార్జున వీళ్ళకి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని ప్రస్తుతానికైతే నిశ్చితార్థం చేశారు…

    ఇక జైనబ్ తండ్రి అయిన జుల్ఫీ రావ్జి కి నాగార్జునకి మధ్య చాలా సంవత్సరాల నుంచి స్నేహపూరితమైన సంబంధాలైతే ఉన్నాయి. దానివల్లే ఇరువురు కూడా బంధువులుగా మారాలని నిశ్చయించుకొని వీళ్ళ పెళ్లి కి ఒక నిర్ణయమైతే తీసుకున్నారు… ఇక తొందర్లోనే వీళ్ళ పెళ్లి బాజాలు కూడా మోగబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇదిలా ఉంటే అఖిల్ మాత్రం ఇప్పుడు మరొక కొత్త సినిమా కోసం తన లుక్కు మొత్తాన్ని చేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించక పోయినా కూడా మరోసారి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఈసారి పక్కా సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మీదట తన పర్సనల్ లైఫ్ ను, సినిమా లైఫ్ ను బ్యాలన్స్ చేస్తూ అఖిల్ ఇకమీదట ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది..