Akhanda in Tamil: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా మేనియా తమిళంలో పాకబోతుంది. మొత్తమ్మీద బాలయ్య అఘోరాగా కనిపించి, అభిమానులను ఎంతగానో అలరించాడు. కాగా ఈ క్రేజీ సూపర్ హిట్ సినిమా అఖండ. 50 రోజులు నిర్విరామంగా ఆడింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళ భాషలో డబ్ చేసిన ఈ చిత్రాన్ని జనవరి 28న (రేపు) థియేటర్స్ లో విడుదల చేయనున్నారు తమిళ డిస్ట్రిబ్యూటర్స్. తెలుగు రాష్ట్రాల్లో తన మేనియా చూపిన బాలయ్య, ఇప్పుడు తమిళనాడులో దుమ్ము రేపబోతున్నాడు. ఏది ఏమైనా తమిళంలో బాలయ్య ‘అఖండ’ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. తెలుగు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన అఖండ బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది.
Also Read: బట్టలు కూడా బరువైతే ఎలా అమ్మడు… బికినీలో రచ్చ చేస్తున్న దిశా పటాని
సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా రూ.కోటి కలెక్షన్లు కలెక్ట్ చేసింది. కోటి కలెక్షన్స్ అంటే ఇది మాములు రికార్డ్ కాదు. ఒక ఏరియాలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టడం గొప్ప విషయం. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

అన్నట్టు థియేటర్స్ కే ఈ సినిమా పరిమితం కాలేదు. ఓటీటీలోనూ కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తోంది. అన్నట్టు జనవరి 21న ఈ చిత్రం ఓటీటీలో విడుదలై. 24 గంటలు కూడా గడవక ముందే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించింది.
Also Read: సమంతే చైతుని విడాకులు అడిగింది – నాగార్జున
[…] Mega family: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసిన ఓ పోస్టు ప్రస్తుతం వివాదాస్పదంగా మారడంతో కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. జనవరి 26 సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ.. సామాన్యుల ఫొటోలతో ఎడిట్ చేసిన ఓ గుడి గోపురం ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో తాను, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. […]
[…] Sreeleela: సినిమా ఇండస్ట్రీలో సింగిల్ హిట్ చాలు, లైఫ్ మారిపోవడానికి. అయితే, ఒక్కోసారి ఒక్క హిట్ కూడా పడకపోయినా.. హిట్ కొట్టే దమ్ము ఉంది అని టాక్ తెచ్చుకుంటే చాలు.. మూడు, నాలుగు సినిమాల ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. ఇక నాలుగు ఆఫర్లు వచ్చే సరికి తమకు ఎక్కడా లేని డిమాండ్ ఉందని అపోహ పడి.. కోటి కావాలి, అవసరం అయితే రెండు కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేస్తారు. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి అలాగే తన రెమ్యునరేషన్ ను దారుణంగా పెంచేసింది. […]