Devakatta: ఇటీవలే రిపబ్లిక్ మూవీతో సక్సెస్ ను అందుకున్న డైరెక్టర్ దేవ కట్టా ప్రస్తుతం ఉన్న సామాజిక అంశాల మీద ప్రజా పాలిత ప్రభుత్వాలని ప్రజలు ఏ విధంగా ప్రశ్నించాలి అనే అంశాల మీద అద్భుతంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు దేవ కట్టా. అయితే అటువంటి కోణంలో తెరకెక్కుతున్న ఒక చిన్న సినిమాకు తన సపోర్ట్ అందించారు దేవ కట్టా.

నూతన దర్శకుడు దినేష్ నర్రా దర్శకత్వంలో ‘ఏవమ్ జగత్’ చిత్రంలో నటించిన నటులు కొత్త వారు గా పల్లెటూరి వాతావరణం మీదుగా తెరకెక్కుతున్నది ఈ చిత్రం.తాజాగా ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు దేవ కట్టా రిలీజ్ చేసి చిత్రయూనిట్ బెస్ట్ విషెస్ చెబుతూ ఆ టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ‘ఏవమ్ జగత్’ టీజర్‌లో వాస్తవాలకు అద్దం పట్టేలా షూట్ చేసిన సన్నివేశాలు చూపిస్తూ ”ఇది కలాం కలలు కన్న దేశం కాదు.. బాపు సాధించిన స్వతంత్రం కాదు.. రాజ్యాంగం నేర్పించిన పరిపాలన కాదు..” అంటూ సాగే డైలాగ్స్ లు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.
‘ధన రాశులు కాదు మనిషికి మనిషే తోడు’ అని ఊరంతా కలిసి కూర్చొని చూసే సినిమా వస్తోంది చూడు’ అంటూ ఒక నిమిషం 45 సెకండ్స్ టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ టీజర్ కొన్ని సన్నివేశాలు సమాజానికి మెసేజ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.అయితే త్వరలో ఈ చిత్రం విడుదల గురించి ప్రకటన చేయనున్నారు.