Das Ka Dhamki’ movie : ఎన్టీఆర్ క్రేజ్.. దుమ్ము లేపేస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ అడ్వాన్స్ బుకింగ్స్..

Das Ka Dhamki’ movie  : విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం మరియు నిర్మాతగా కూడా వ్యవహరించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22 వ తారీఖున ఉగాది కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అలాగే పాటలు కూడా బాగా వైరల్ అయ్యింది. వీటి అన్నిటికి తోడు […]

Written By: NARESH, Updated On : March 20, 2023 10:24 pm
Follow us on

Das Ka Dhamki’ movie  : విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం మరియు నిర్మాతగా కూడా వ్యవహరించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22 వ తారీఖున ఉగాది కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అలాగే పాటలు కూడా బాగా వైరల్ అయ్యింది.

వీటి అన్నిటికి తోడు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయడం వల్ల ఈ సినిమా మీద ఉన్న హైప్ డబుల్ అయ్యింది.అంతే కాదు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఈ చిత్రానికి బాగా సహాయపడ్డాయి.రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.ఒకసారి ఆ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉందో చూద్దాము.

సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోరు ముగిసిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ బాగా డ్రై అయిపోయింది.సరైన సూపర్ హిట్ సినిమాలు లేక బాక్స్ ఆఫీస్ బోసిపోయింది.ఈమధ్యనే విడుదలైన ‘బలగం’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యినప్పటికీ అది కేవలం తెలంగాణ కి మాత్రమే పరిమితం అయ్యింది.మరోసారి భారీ హిట్ తగిలి బాక్స్ ఆఫీస్ కళకళలాడిపొయ్యే రోజు కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అందుకు ‘ధమ్కీ’ సినిమానే సరైనది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.అందుకే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి.

దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం తో ఆయన అభిమానులు కూడా ఈ చిత్రానికి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూస్తూ ఉంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.ఉగాది కూడా కలిసి రావడం తో టాక్ వస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అనే నమ్మకం తో ఉండి ట్రేడ్.