https://oktelugu.com/

Adipurush Official Trailer : ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ: ఈసారికి ఫర్వాలేదు.. కానీ సినిమాకి అదే పెద్ద మైనస్

నీట్ గా రామాయణ ఇతివృత్తాన్ని సంప్రదాయం ప్రకారం తీర్చిదిద్దారు. ఈసారి అచ్చం రామాయణ కాలం నాటి నేటివిటీని అతికేలా సరిదిద్దారు. గతం కంటే ట్రైలర్ బాగుందని చెప్పొచ్చు. 

Written By:
  • NARESH
  • , Updated On : May 9, 2023 / 02:34 PM IST
    Follow us on

    Adipurush Official Trailer : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకోని జూన్ 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు అన్నీ ప్రాంతీయ భాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఆన్లైన్ లో విడుదల అయ్యేందుకు ముందే , నిన్న హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో ప్రదర్శించారు.

    దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ ని చూసి మంచి జోష్ మీద ఉన్నారు, ఇక కాసేపటి క్రితమే ఈ ట్రైలర్ అన్ని వెర్షన్స్ కి కలిపి యూట్యూబ్ లో విడుదల చేసారు, టీజర్ సమయం లో వచినటువంటి నెగటివిటీ మొత్తం ఈ ట్రైలర్ తో పోయిందా, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే సత్తా ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

    భారీ అంచనాల నడుమ కాసేపటి క్రితమే విడుదలైన ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ – ఆడియన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. గ్రాఫిక్స్ మొత్తం చూస్తూ ఉంటె, రామాయణం కాలం లోకి మనం అడుగుపెట్టామా అనే అనుభూతి కలిగింది. కంప్యూటర్ మొబైల్ లో చూసినప్పుడే ఇలాంటి అనుభూతి కలిగితే ఇక థియేటర్స్ లో చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. గత తప్పులన్నీ కరెక్ట్ చేసి ఈసారి క్వాలిటీగా గ్రాఫిక్స్ వర్క్ చేశారు. నీట్ గా రామాయణ ఇతివృత్తాన్ని సంప్రదాయం ప్రకారం తీర్చిదిద్దారు. ఈసారి అచ్చం రామాయణ కాలం నాటి నేటివిటీని అతికేలా సరిదిద్దారు. గతం కంటే ట్రైలర్ బాగుందని చెప్పొచ్చు.

    ఆది పురుష్ ట్రైలర్ లో కనిపించే వానర సైన్యం మొత్తానికి మోషన్ కాప్చర్ టెక్నాలజీ ని ఉపయోగించారు. అందుకే అవి ఎంతో న్యాచురల్ గా అనిపిస్తున్నాయి. ఒక్క ట్రైలర్ తోనే రామాయణం లోని ముఖ్యమైన ఘట్టాలను మొత్తం చూపించేసాడు డైరెక్టర్. ట్రైలర్ మొత్తం బాగున్నప్పటికీ ప్రభాస్ లుక్స్ ,  డైలాగ్ డెలివరీ మొత్తం తేడా కొట్టేసింది. ఇదే ఈ ట్రైలర్ కి మైనస్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు,సినిమాలో అయినా మెరుగుగా ఉంటుందో లేదో చూడాలి.