https://oktelugu.com/

Actress Meena: కోవిడ్ బారిన పడ్డ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ… ఎవరంటే ?

Actress Meena: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున అలజడి అంతా ఇంతాకాదు. కోవిడ్ ధాటికి ప్రజలు అల్లకల్లోలం అయ్యారు. గతేడాది మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ భ్రాంతులకు గురి చేసింది. సామాన్య జనాలతో పాటు సినీ జనాలు కూడా కరోనాతో విలవిలలాడారు. 2022 కొత్త యేడాదిలో కూడా కరోనా థర్డ్ వేవ్ ఓమైక్రాన్ రూపంలో దేశంపై విరుచుపడుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 6, 2022 / 10:00 AM IST
    Follow us on

    Actress Meena: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున అలజడి అంతా ఇంతాకాదు. కోవిడ్ ధాటికి ప్రజలు అల్లకల్లోలం అయ్యారు. గతేడాది మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ భ్రాంతులకు గురి చేసింది. సామాన్య జనాలతో పాటు సినీ జనాలు కూడా కరోనాతో విలవిలలాడారు. 2022 కొత్త యేడాదిలో కూడా కరోనా థర్డ్ వేవ్ ఓమైక్రాన్ రూపంలో దేశంపై విరుచుపడుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ కరోనా ధాటికి విలవిలలాడుతుంది. ఇక యువ హీరో మంచు మనోజ్‌తో పాటు విక్రమ్, వడివేలు, అర్జున్ కపూర్ ఫ్యామిలీతో పాటు జాన్ అబ్రహం వంటి నటులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా మీనా కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారు.

    నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. తన అందం, అభినయంతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీనా. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా అలరించారు ఈమె. గతేడాది వెంకటేష్‌తో ‘దృశ్యం 2’తో పాటు.. రజినీకాంత్‌తో కలిసి ‘పెద్దన్న’ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారని తెలుస్తుంది. ఈ విషయాన్ని మీనా స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

    ఈ న్యూ ఇయర్ మా ఇంట్లో వచ్చిన కొత్త అతిథి ‘కరోనా’ అంటూ చమత్కారంగా చెప్పుకొచ్చారు మీనా. దానికి మా ఫ్యామిలీ అంతా నచ్చేసింది. కానీ ఆ అథితిని మేం త్వరలోనే సాగనంపుతాం అంటూ మీనా చెప్పింది. మీనా విషయాని కొస్తే.. 90లలో నెంబర్ వన్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సత్తా చాటింది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తూ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.