Site icon OkTelugu

Kayadu Lohar: వేధింపులు తట్టుకోలేక కుర్రాడి తల పగలగొట్టిన హీరోయిన్ కాయదు లోహర్..

Kayadu Lohar

Kayadu Lohar

Kayadu Lohar: ఆడపిల్లలపై ఈవ్ టీజింగ్ చేయడం కుర్రాళ్లకు కొత్తేమి కాదు. సరదాగా ర్యాగింగ్ చేయడం వేరు, అసభ్యంగా ప్రవర్తిస్తూ , మానవ మృగం లాగా ప్రవర్తించడం వేరు, ఇలా ప్రవర్తించే ముందు మన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు అనే విషయాన్ని ఎలా మర్చిపోతారో అసలు అర్థం అవ్వదు. ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇప్పటికీ కూడా ఈ ఈవ్ టీజింగ్ కేసులు తగ్గడం లేదు. కేవలం సామాన్య మహిళలపై మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీలపైన కూడా ఇలాంటి ఈవ్ టీజింగ్ లు గతం లో జరిగాయట. అలాంటి సెలబ్రిటీస్ లో ఒకరు డ్రాగన్ హీరోయిన్ జయదు లోహర్. తనని ఈవ్ టీజింగ్ చేసిన కుర్రాడిపై ఈమె చేసిన పోరాటం చూసి ప్రతీ మహిళ ఎంత ధైర్యం గా ఉండాలో నేర్చుకోవాలి, మగవాళ్లకు తమ ఇష్టం లేకుండా ప్రవర్తిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూపించాలి.

రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో 16 ఏళ్ళ వయస్సు లో తన జీవితం లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘సరిగ్గా నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఒక ట్యూషన్ కి వెళ్లేదాన్ని. ఆ సమయంలో మార్గం మధ్యలో ఒక కుర్రాడు నను అనుసరిస్తూ ఉండేవాడు. మొదట్లో పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. కానీ అతను హద్దులు దాటి నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో నా కోపం కట్టలు తెంచుకుంది. ఒకరోజు అలా ప్రవర్తించడం తో పక్కనే ఒక పెద్ద రాయిని తీసుకొని అతని తల మీద వేశాను , దెబ్బ చాలా గట్టిగా తగిలింది , రక్తం బాగా కారింది. దీంతో భయపడిపోయిన ఆ కుర్రాడు అక్కడి నుండి పారిపోయాడు. నేను చూసేందుకు చాలా సాఫ్ట్ గానే కనిపిస్తాను , కానీ తప్పు జరిగితే మాత్రం నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది, ఆ సమయంలో ఏమి చేస్తానో నాకే తెలియదు. ఆరోజు ఆ కుర్రాడు అంతలా అసభ్యంగా ప్రవర్తించబట్టే నేను అతని తల పగలగొట్టాల్సి వచ్చింది, భవిష్యత్తులో కూడా ఇంతే , ఎవరైనా నా పట్ల అలా ప్రవర్తిస్తే ఇలాగే రియాక్ట్ అవుతాను’ అంటూ చెప్పుకొచ్చింది కాయదు లోహర్.

ఇకపోతే ప్రస్తుతం ఆమె టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ‘ది ప్యారడైజ్’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఈమె పల్లి చట్టంబి, ఫంకీ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ తో పాటుగా, ఇదయం మురళి, ఇమ్మొర్తల్ వంటి క్రేజీ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తెలుగు లో కూడా ఈమె కాల్ షీట్స్ కోసం ప్రముఖ దర్శక నిర్మాతలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. రెండు సినిమాలకు కూడా రీసెంట్ గానే సంతకాలు చేసిందట. వాటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version