Site icon OkTelugu

Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ లో పాయింట్స్ ఇవే

Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ లు కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. అయితే, మెగా అభిమానులు అందరూ ఆచార్య ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను మొదట ఫిబ్రవరి 2న విడుదల చేయడానికి ప్లాన్ చేసినా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

Acharya

‘శ్రీరామ నవమి’ సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయవచ్చనే టాక్ వినిపించింది. కానీ ఈ నెల 12వ తేదీన ట్రైలర్‌ను వదులుతున్నట్టుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్, పూజ హెగ్డే లపై వేసిన ఈ పోస్టర్ చాలా బాగా ఆకట్టుకుంటోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రెడీ చేసింది టీమ్. ఈ ట్రైలర్ లో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు మీద ఎమోషనల్ సీన్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ముఖ్యంగా మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్.. ఇక దేవాలయాల పై చిరు చెప్పే డైలాగ్, అదే విధంగా చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతాయట.

మొత్తానికి మెగా అభిమానులను హ్యాపీ చేయడానికి కొరటాల బాగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

Acharya

ప్రతి సీన్ విషయంలో చిరు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. అన్నట్టు ఆచార్యలో చ‌ర‌ణ్ పాత్ర‌ ఎంతసేపు ఉంటుంది ? ఆచార్య‌లో చ‌ర‌ణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండ‌బోతుంది.

చిరు – చరణ్ మ‌ధ్య ఉండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్‌ 29న స‌మ్మ‌ర్ కానుక‌గా థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ర‌న్ టైం సుమారు 2 గంట‌ల 58 నిమిషాలు ఉండేలా కొర‌టాల ప్లాన్ చేశాడు.

Exit mobile version