Homeఎంటర్టైన్మెంట్Divya Sridhar Marriage: 50 ఏళ్ల నటుడితో 38 ఏళ్ల నటి వివాహం.. దేశవ్యాప్తంగా సంచలనం

Divya Sridhar Marriage: 50 ఏళ్ల నటుడితో 38 ఏళ్ల నటి వివాహం.. దేశవ్యాప్తంగా సంచలనం

Divya Sridhar Marriage: కొన్ని వివాహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పెళ్లి అంటే ఈడు జోడు ఉండాలి అంటారు. చిత్ర పరిశ్రమలో ఇందుకు విరుద్ధంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రేమ పెళ్లిళ్ల విషయంలో సమీకరణాలు పాంటించరు. సాధారణంగా అబ్బాయి అమ్మాయి మధ్య 5 ఐదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంటుంది. వరుడు కంటే వధువు వయసు తక్కువ ఉండాలి. ఇది హిందూ సాంప్రదాయ వివాహాల్లో పాటించే నియమం. తమ కంటే వయసులో పెద్ద అమ్మాయిలను వివాహం చేసుకున్న నటులు ఉన్నారు. మహేష్ బాబు కంటే ఆయన భార్య నమ్రత దాదాపు 5 ఏళ్ళు పెద్దది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ఓ విచిత్ర వివాహం చోటు చేసుకుంది. మలయాళ టెలివిజన్ నటులు క్రిష్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్ వివాహం చేసుకున్నారు. వేణు గోపాల్ వయసులో చాలా పెద్దవాడు. దివ్య-వేణు గోపాల్ కి మధ్య వయసు వ్యత్యాసం 12 ఏళ్ళు ఉంది. ఈ వివాహం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. అక్టోబర్ 30న గురువాయూర్ టెంపుల్ లో ఈ వివాహం జరిగింది. ఈ పెళ్ళికి వధూవరుల బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.

వేణు గోపాల్, దివ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఓ సీరియల్ లో కలిసి నటించారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దివ్యకు ఇది రెండో వివాహం. మొదటి భర్తతో ఆమెకు ఇద్దరు సంతానం. చాలా ఆలోచించి దివ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. వేణు గోపాల్ దివ్యకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడట. మొదట్లో ఆమె ఆయన జోక్ చేస్తున్నాడని అనుకుందట. అనంతరం ఆయన సీరియస్ గా ఫిక్స్ అయ్యాడని తెలుసుకుందట.

ఈ విషయం తన పిల్లలకు చెప్పిందట. రెండో వివాహం వలన ఆమెతో పాటు పిల్లలకు భద్రత ఉంటుందని వారు భావించారట. పిల్లల అనుమతితో దివ్య వివాహం చేసుకుందట. ఇక దివ్య, వేణు గోపాల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సింగర్ సునీత సైతం 42 రెండేళ్ల వయసులో వివాహం చేసుకుంది. ఆమెకు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిజినెస్ మెన్ రామ్ ని సునీత వివాహం చేసుకుంది. రామ్ తో వివాహం అనంతరం సునీత జీవితం మారిపోయింది. ప్రస్తుతం ఆమె విలాసవంతమైన జీవితం అనుభవిస్తుంది. కొడుకును హీరోగా పరిచయం చేసింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.

 

View this post on Instagram

 

A post shared by Aadhan Telugu (@aadhan_telugu)

RELATED ARTICLES

Most Popular