మెగాస్టార్ మూవీ కోసం 20కోట్ల సెట్!

  మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్లో చిరంజీవి-152వ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. కోకాపేటలో చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఇంటి సెట్ ఏర్పాటు చేసి షూటింగ్ చేశారు. కథలో భాగంగా 20కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి ఈ మూవీలో ఎండోమ్మెంట్ ఆఫీసర్ గా కన్పించబోతున్నాడు. దీంతో ఓ […]

Written By: admin, Updated On : February 8, 2020 10:26 am
Follow us on

 

మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్లో చిరంజీవి-152వ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. కోకాపేటలో చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఇంటి సెట్ ఏర్పాటు చేసి షూటింగ్ చేశారు. కథలో భాగంగా 20కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి ఈ మూవీలో ఎండోమ్మెంట్ ఆఫీసర్ గా కన్పించబోతున్నాడు. దీంతో ఓ టెంపుల్ సెట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

 

కొరటాల శివ సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్లతోపాటు సోషల్ మేసేజ్ ఉంటాయి. చిరంజీవి సినిమాలు కూడా దాదాపు ఇలానే ఉంటాయి. కొరటాల శివ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించినవే. దీంతో నిర్మాత కూడా ఏమాత్రం ఖర్చుకు వెనుకాకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో అసలు ఖర్చు కంటే సెట్ల కోసం వేసే ఖర్చే ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. సైరా మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో రాంచరణ్ కొంత ఖర్చు తగ్గించే ఆలోచనలో పడ్డాయి. అయితే మెగాస్టార్-కొరటాల కాంబినేషన్ కావడంతోనే ఖర్చుకు రాంచరణ్ ఖర్చుకు వెనుకడం లేదు. ఈ మూవీ ఖర్చు రూ.150కోట్లు దాటేలా కన్పిస్తుంది.

 

ఈ మూవీలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవి జోడిగా సీనియర్ కథానాయిక త్రిష నటిస్తుంది. అలాగే ఓ ముఖ్య పాత్రలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తోంది. ఇటీవలే చిరంజీవి-రెజీనాలపై ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అందించిన బాణీలకు మెగాస్టార్-రెజీనాలు అదిరిపోయే స్పెప్పులు వేసినట్లు సమాచారం. చాలా రోజల తర్వాత చిరంజీవి మూవీకి మణిశర్మ మ్యూజికల్ అందిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీలన్నీ మ్యూజికల్ హిట్టయినవే. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ హీరో చిరంజీవి, మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ, డైనమిక్ నిర్మాత రాంచరణ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.