Elon Musk: ఓరి నాయనో ఇన్ని వ్యూసా? ఏం మాయ చేశావు మస్క్‌?

ఎక్స్‌ అనే లోగోను ఎలాన్‌ మస్క్‌ శాని ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయంపై ఆవిష్కరించాడు. అంతే కాదు దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన కొత్త కంపెనీ షేర్‌ లాగా ఆ వీడియో దూసుకుపోయింది.

  • Written By: Bhaskar
  • Published On:
Elon Musk: ఓరి నాయనో ఇన్ని వ్యూసా? ఏం మాయ చేశావు మస్క్‌?

Elon Musk: ఎలాన్‌ మస్క్‌.. ఈ టెస్లా ఓనర్‌ ఏం చేసినా సంచలనమవుతోంది. ట్విట్టర్‌ ను కొనుగోలు చేయడం, దాని సీఈవోను మార్చేయడం, ఉద్యోగులను తొలగించడం, కార్యాలయాలను మూసేయడం.. ఒకటా రెండా రాస్తే ఒక పుస్తకమే అవుతుంది. అంతటితో ఆగితే అతడు మస్క్‌ ఎందుకవుతాడు. ట్విట్టర్‌లో మరిన్ని మార్పులు చేశాడు. ఫేస్‌ బుక్‌ అధిపతి మార్క్‌ జూకర్‌ బర్గ్‌ థ్రెడ్స్‌ అనే ఇన్‌ స్టా గ్రామ్‌తో అనుసంధానమయ్యే యాప్‌ను తీసుకొచ్చినా నేనింతే మారనంతే అనే రేంజ్‌లో ట్విట్టర్‌ పిట్ట రెక్కలు విరిచేశాడు. దానికి కొత్తగా ‘ఎక్స్‌’ అనే లోగో యాడ్‌ చేశాడు. అక్కడితోనే మస్క్‌ ఊరుకోలేదు.

ఎక్స్‌ అనే లోగోను ఎలాన్‌ మస్క్‌ శాని ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయంపై ఆవిష్కరించాడు. అంతే కాదు దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన కొత్త కంపెనీ షేర్‌ లాగా ఆ వీడియో దూసుకుపోయింది. ఏకంగా 26,600 కామెంట్లు, 41,500కు పైగా రీట్వీట్లు, 37.6 మిలియన్‌ వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ఇదే ఊపులో మస్క్‌ తన కారు లోపల కూర్చుని మరో వీడియో రికార్డు చేసి షేర్‌ చేశాడు.

‘ఈ రాత్రి శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయం మీద మస్క్‌ తన కొత్త లోగోను ప్రత్యేంగా చూపిస్తూ వీడియో తీశారు. అయితే శాన్‌ ఫ్రాన్సిస్కో నగరం డౌన్‌ టౌన్‌ భవనంపై అమర్చిన కొత్త అక్షరం లోగోపై దర్యాప్తు ప్రారంభించిన సమయంలో ఈ వీడియో షేర్‌ చేశారు. నగర అధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఏదైనా సైన్‌ బోర్డు లేదా లోగోను మార్చేందుకు ముందు, ఒక వ్యక్తి(లేదా కంపెనీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని’ అసోసియేటెడ్‌ ప్రెస్‌ నివేదించింది. ఇక మస్క్‌ తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అబ్బురపడ్డారు. ‘ఇది సూపర్‌ హీరో చిత్రం బ్యాట్‌ మెన్‌ ను పోలి ఉందని’ పేర్కొన్నారు. మరికొంత మంది మ్యాజిక్‌లాగా ఉందని కీర్తించారు.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు