Elon Musk- Apple: ట్విట్టర్ ను ఈ ముహూర్తన కొనుగోలు చేశాడో కానీ మస్క్ మామకు ఏదీ కలిసి రావడం లేదు. దీనికి తోడు అతడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ట్విట్టర్ పిట్టను మరింత ఆగమాగం చేస్తున్నాయి. ఈ నవంబరులో ప్రకటనల ఆదాయం భారీగా తగ్గడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఏకంగా ట్విట్టర్ అధిపతి యాపిల్ లాంటి కంపెనీ ని ప్రకటనలు ఎందుకు నిలుపుదల చేశారని బహిరంగంగా అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం యాపిల్ మాత్రమే కాదు… పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు కూడా ట్విట్టర్ కు ప్రకటనలు ఇవ్వడం లేదు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇది ఎంత మేరకు దారితీస్తుందోనని కార్పొరేట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Elon Musk- Apple
ఏం జరుగుతోంది
అక్టోబర్ 16 నుంచి 22 దాకా రెండు లక్షల 20వేల ఎనిమిది వందల డాలర్లను తన కంపెనీ ప్రమోషన్ కోసం యాపిల్ కంపెనీ ట్విట్టర్ ద్వారా ఖర్చు చేసింది.. నవంబర్ 10 నుంచి 16 దాకా 1,31,600 డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది. ఎలన్ మస్క్ నిర్ణయాల కారణంగా యాపిల్ కంపెనీ తన ప్రకటనలను ట్విట్టర్ కి నిలిపివేసింది. దీనికి నొచ్చుకున్న ఎలన్ మస్క్ “యాపిల్ కంపెనీ ట్విట్టర్ కు ప్రకటనలు నిలిపివేసింది. అమెరికాలో ఆ కంపెనీ వాక్ స్వేచ్ఛ ను ద్వేషిస్తుందా” అని ట్వీట్ చేయడం గమనార్హం.. కేవలం యాపిల్ కంపెనీ మాత్రమే కాదు జనరల్ మోటార్స్, సిటీ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు కూడా ప్రకటనలు నిలిపి వేశాయి.. ఇదే దారిలో కూడా కొన్ని ఉన్నాయి. అయితే వీటన్నింటికి కారణం ఎలన్ మస్క్ నోటి దురుసే. అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల నొచ్చుకున్న కార్పొరేట్ సంస్థలు ట్విట్టర్ కు కాకుండా ఇతర సామాజిక మాధ్యమాలకు ప్రకటనలు ఇస్తున్నాయి. గత నెలలో ట్విట్టర్ ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేశాడు .. కానీ అతడు కొనుగోలు చేసిన నాటి నుంచి ట్విట్టర్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. పరాగ్ అగర్వాల్, గద్దె విజయ ఉద్వాసనకు గురయ్యారు. అదేవిధంగా 1500 మంది ఉద్యోగులు తిరస్కరణకు గురయ్యారు. దీంతో ట్విట్టర్ ప్రకటన ఆదాయం 45% మేర పడిపోయింది. అయితే ఇదే సమయంలో 2028 నాటికి ట్విట్టర్ 12 బిలియన్ల ఆదాయం ఆశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చందాల రూపంలో మరో 10 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఇంక్ అధిపతి అయిన మస్క్ ట్విట్టర్ లోకి నగదు ప్రవహాన్ని 2025లో 3.2 బిలియన్ డాలర్లకు, 2028లో 9.4 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా ఉన్నారు. దీనిని అమెరికా మీడియా కొట్టిపారేస్తోంది. అసలే ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎలా చేస్తారని తప్పు పట్టింది.

Elon Musk- Apple
నోటి దురుసు తగ్గించుకో మస్క్
అయితే ట్విట్టర్ పరిస్థితిని చూసి చాలామంది జాలి పడుతున్నారు. ఇదే సమయంలో మస్క్ నోటి దురుసు పై మండి పడుతున్నారు.. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ పై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ క్రమంలో వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించేందుకు మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా ట్విట్టర్ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి.. అయితే ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన వేళ.. ఎలన్ మస్క్ వేస్తున్న అడుగులు ఆ సంస్థ అభివృద్ధికి ప్రతి బంధకంగా మారుతున్నాయి. ట్విట్టర్ కు ప్రకటనలు ఇచ్చే కార్పొరేట్లపై దురుసుగా వ్యవహరిస్తుండడంతో వాళ్లు ట్విట్టర్ కు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రకటనలు ఇవ్వకుండా సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నారు. అయినప్పటికీ మస్క్ తీరులో మార్పు రాలేదు. పైగా “ఏం జరుగుతోంది” అని యాపిల్ కంపెనీని అతడు నిలదీస్తుండడం గమనార్హం