Twitter New Logo: నీలి పిట్ట ఎగిరిపోయింది..కొత్త ఎక్స్ వచ్చేసింది..
ట్విట్టర్ లోగో మార్చాలి అనే ఉద్దేశ్యాన్ని 24 గంటల క్రితమే మస్క్ వెల్లడించారు…”ఎక్స్” అనే లోగోను డిజైన్ చేసి చూపించాలని తనను అనుసరిస్తున్న 149 మంది మిలియన్ నెటిజన్ల ను ఆయన కోరారు. ఆరు డిజైన్ చేసి పోస్ట్ చేయడం, వాటిలో ఒకదానిని మస్క్ ఎంపిక చేయడం వెంటనే జరిగిపోయాయి.

Twitter New Logo: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్ లో మరో కొత్త మార్పు తీసుకొచ్చారు దాని అధిపతి ఎలాన్ మస్క్. “ఎక్స్” సింబల్ ను ట్విట్టర్ కొత్త లోగోగా ప్రకటించారు. ఫలితంగా 17 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐకానిక్ బ్లూ బర్డ్ గత చరిత్ర అయింది. దాని నీలిరంగు రెక్కలకు శుభం కార్డు పడింది..
24 గంటల్లోనే..
ట్విట్టర్ లోగో మార్చాలి అనే ఉద్దేశ్యాన్ని 24 గంటల క్రితమే మస్క్ వెల్లడించారు…”ఎక్స్” అనే లోగోను డిజైన్ చేసి చూపించాలని తనను అనుసరిస్తున్న 149 మంది మిలియన్ నెటిజన్ల ను ఆయన కోరారు. ఆరు డిజైన్ చేసి పోస్ట్ చేయడం, వాటిలో ఒకదానిని మస్క్ ఎంపిక చేయడం వెంటనే జరిగిపోయాయి. దీంతో ఇక ఇప్పుడు ఎక్స్ లోగో ట్విట్టర్ నీలిరంగు పక్షిని బయటికి పంపించింది. కేవలం లోగో మాత్రమే కాకుండా సోషల్ మీడియా హోం పేజీ, మస్క్ ప్రొఫైల్ ఫోటో, లోడింగ్ యానిమేషన్స్ లో కూడా ఎక్స్ లోగో కనిపిస్తోంది. అయితే ఈ డిజైన్ తాత్కాలికమేనని, త్వరలో దీనికి తుది మెరుగులు దిద్దే అవకాశం ఉంటుందని మస్క్ తనను అనుసరిస్తున్న వారికి చెప్పాడు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా శాన్ ఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ కార్యాలయం పై కూడా లోగోను ప్రాజెక్ట్ చేశారు.. ట్విట్టర్ కొత్త సీఈవో లిండా సాసరినో సైతం ఎక్స్ కు మద్దతు ప్రకటించారు.
చాలా ఇష్టం
ఎక్స్ అంటే మస్క్ కు చాలా ఇష్టం. స్పేస్ ఎక్స్ లో కూడా ఎక్స్ ఉంటుంది. 1990 ల నుంచే మస్క్ తాను చేసే ప్రతి పనిలోనూ ఎక్స్ అనే పదాన్ని ఉండేలా చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ పదం అంటే అతడికి ఒక సెంటిమెంట్ లాగా మారింది..పే పాల్ అనే సంస్థను ఏర్పాటు చేసే ముందు ఎక్స్. కామ్ అనే అన్ లైన్ బ్యాకింగ్ ప్లాట్ ఫామ్ ను మస్క్ ప్రారంభించాడు..2017 లో ఆ డొమైన్ ను మళ్లీ కొనుగోలు చేశాడు. తర్వాత రకరకాల ప్రయోగాలు చేశాడు.. టెస్లా ను తెరపైకి తీసుకొచ్చాడు. “స్పేస్ స్ ఎక్స్” అనే కంపెనీని ప్రారంభించాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. అందులోనూ ప్రయోగాలు చేశాడు. దానిని కొనుగోలు చేసిన తర్వాత తనకు నచ్చిన విధంగా రూపకల్పన చేసుకున్నాడు. ఇవి వివాదాలకు దారి తీసినప్పటికీ మస్క్ తన ధోరణి మార్చుకోలేదు. “మనలో లోపాలు మనల్ని ప్రత్యేకం చేస్తాయి. అయితే ఆ ప్రత్యేకతను మనం గట్టిగా చాటుకోవాల్సి ఉంటుంది. దానిని చాటుకునే ప్రయత్నంలోనే ఎక్స్ అనే లోగో నీలిరంగు పిట్టను బయటకి పంపించింది” అని మస్ వెల్లడించాడు.. అన్నట్టు ట్విట్టర్ కొత్తలోగో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
