Basketball League : ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్ నేడే హైదరాబాద్ లో ప్రారంభం.. టాలెంట్ ఉన్నవాళ్లకు అరుదైన అవకాశం!
ఇక తెలంగాణ రాష్ట్రం తో పాటుగా దేశం నలుమూలల ఉన్న అథ్లెట్స్ ఈ ఏడాది చివరిలోగా అత్యధికంగా డ్రాఫ్ట్ లో ఉండేలా చూసుకుంటామని నిర్వాహకులు ఈ సందర్భంగా మీడియా కి చెప్పుకొచ్చారు

Basketball League : ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్ కి హైదరాబాద్ లోని డ్రీం బాస్కెట్ బాల్ అకాడమీ వేదిక కానుంది. నేడు ఈ అకాడమీ లో ట్రై ఔట్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రై అవుట్ ప్రక్రియ జూన్ 11 వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ ట్రై ఔట్స్ కి హైదరాబాద్ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల నుండి 250 కి పైగా ఎంట్రీలు ఉంటాయని ఆశిస్తున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రం తో పాటుగా దేశం నలుమూలల ఉన్న అథ్లెట్స్ ఈ ఏడాది చివరిలోగా అత్యధికంగా డ్రాఫ్ట్ లో ఉండేలా చూసుకుంటామని నిర్వాహకులు ఈ సందర్భంగా మీడియా కి చెప్పుకొచ్చారు. ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్ భారతదేశం నలుమూలల నుండి అత్యంత ప్రతిభా వంతులైన క్రీడాకారులతో ఏర్పాటు అయినా 6 టీమ్స్ సమ్మేళనం. ఈ లీగ్ యొక్క ప్రధాన లక్ష్యం దేశం లోని అన్నీ ప్రాంతాల నుండి ప్రతిభ ఉన్నవారికి పోటీలో పాల్గొనే అదృష్టం కలిగించడం.
ఈ సందర్భంగా బోర్డు సభ్యులు మాట్లాడుతూ ‘ భారతదేశం లో మొట్టమొదటి ప్రో ఉమెన్స్ లీగ్ ని ఏర్పాటు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మా లక్ష్యం లీగ్ ప్లేయర్స్ ని సెంట్రిక్ గా మార్చడమే. భారతదేశం లోనే వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాలలో ఉన్న అత్యంత ప్రతివంతులైన క్రీడాకారులను మా లీగ్ లోకి చేర్చుకోవడమే ప్రధాన లక్ష్యం. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఒకే చోట మా కారణం గా చేరడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కలయిక ఏళ్ళ తరబడి స్థిరంగా అలాగే ఉండిపోతుంది. మా లీగ్ కి ట్యాగ్ లైన్ గా ‘రోక్ సాకో తో రోక్ లో’ అని పెడుతున్నాము’ అంటూ లీగ్ CEO సన్నీ భండార్కర్ చెప్పుకొచ్చారు.
ఈ సెలక్షన్ కమిటీ లో భారతదేశం నుండి అత్యుత్తమ కోచ్ లు ఉంటారు. వారి అపారమైన అనుభవం అథ్లెట్స్ కి వ్యూహాలతో ఆడడం అలవాటు అవుతుంది. ఇక జూన్ 16 నుండి 18 వ తారీఖు వరకు ముంబైలో అలాగే జూన్ 23 నుండి 25 వరకు కోల్ కత్తా లో ట్రై అవుట్ మ్యాచులు జరగనున్నాయి అని సమాచారం.
