Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ టెన్షన్… అనూహ్యంగా టాప్ కంటెస్టెంట్ అవుట్!
అమర్ దీప్, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, దామిని, ప్రియాంక, ప్రిన్స్ యావర్ మూడో వారానికి నామినేట్ అయ్యారు. ఓటింగ్ లెక్కలు పరిశీలించిన నేపథ్యంలో సీరియల్ నటుడు అమర్ దీప్ టాప్ లో దూసుకుపోతున్నాడట.

Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతుంది. నేడు శనివారం కాగా హోస్ట్ నాగార్జున రంగంలోకి దిగనున్నాడు. ఈ వారం హౌస్లో జరిగిన విషయాలపై రివ్యూ నిర్వహించనున్నారు. హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉండగా… ఎవరెవరు ఎలా ఆడారో తెలియజేస్తాడు. పొగడ్తలు, చివాట్లు చోటు చేసుకోనున్నాయి. వీటన్నింటికీ మించి ఎలిమినేషన్ టెన్షన్ మొదలైపోయింది. ఈసారి నామినేషన్స్ లో ఉన్నవారందరూ టాప్ కంటెన్స్టెంట్స్. ఈ క్రమంలో ఎవరు మూటాముల్లె సర్దుకోవాల్సి వస్తుందనే సందిగ్ధత కొనసాగుతుంది.
అమర్ దీప్, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, దామిని, ప్రియాంక, ప్రిన్స్ యావర్ మూడో వారానికి నామినేట్ అయ్యారు. ఓటింగ్ లెక్కలు పరిశీలించిన నేపథ్యంలో సీరియల్ నటుడు అమర్ దీప్ టాప్ లో దూసుకుపోతున్నాడట. అమర్ దీప్ ఒక్కడికే 30 శాతానికి పైగా ఓట్లు పడ్డాయని సమాచారం. అమర్ దీప్ తర్వాత గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, రతికా రోజ్ కొనసాగుతున్నారట. ఇక ప్రియాంక, దామిని చివరి స్థానాల్లో ఉన్నారని సమాచారం.
ప్రియాంక-దామిని ఓటింగ్లో వెనకబడ్డారట. అయితే వీరిద్దరి మధ్య కూడా ఓట్లలో చాలా వ్యత్యాసం ఉందట. దామినికి జనాలు ఓట్లు పెద్దగా వేయలేదని తెలుస్తుంది. కేవలం 4-5 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయట. ఈ క్రమంలో నెక్స్ట్ హౌస్ వీడే కంటెస్టెంట్ దామిని అంటున్నారు. మరి ఇదే నిజమైతే వరుసగా హౌస్ ని వీడిన మూడో లేడీ కంటెస్టెంట్ దామిని అవుతుంది. కిరణ్ రాథోడ్, షకీలా ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ లో ఇంటిదారి పట్టారు.
చెప్పాలంటే దామిని గేమ్ పర్లేదు. నామినేషన్ లో ఉన్నవాళ్ళతో పోటీపడలేక వెనక్కి తగ్గి ఉండొచ్చు. మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. నటుడు అంబటి అర్జున్, నటి పూజా మూర్తి, హీరోయిన్ ఫర్జానాతో పాటు మరికొందరు వైల్డ్ కార్డు లిస్ట్ లో ఉన్నారట. ఈ సీజన్ కేవలం 14 మందితో మొదలైన విషయం తెలిసిందే..
