Electric AC buses : 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు.. హైదరాబాద్ టు విజయవాడకు ఇక ఈజీ
ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రోడ్లు ఎక్కుతున్నాయి. దీంతో ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఉపయోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ కో రుతోంది.

Electric AC buses : టీఎస్ ఆర్టీసీ కొత్త తరహా బస్సులకు రూపకల్పన చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీతో నూతన మార్గంలోకి వెళ్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్-విజయవాడ రూట్లో ఈ బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ 20 బస్సులు మంగళవారం ప్రారంభించనుంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మియాపూర్ స్టాప్ లో బస్సులను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ – విజయవాడ రూట్లో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ర్టికల్ బస్సు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రాబోయే రెండేళ్లలో 1860 బస్సులు కొనుగోలు చేయనున్నారు. 1300 బస్సులు హైదరాబాద్ సిటీలో 550 బస్సులను ఇతర ప్రాంతాలకు నడపనున్నారు. హైదరాబాద్ లో 10 డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నారు.
బస్సు పొడవు 12 మీటర్లు ఉంటుంది. 41 సీట్లు కలిగి ఉంటుంది. ఆధునిక హంగులతో అన్ని సదుపాయాలు కల్పించారు. దీంతో ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రతి బస్సులోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అధునాతన సౌకర్యాలతో బస్సు ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
బస్సులో ఏదైనా అగ్ని ప్రమాదం ఏర్పడితే వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది. దీంతో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రోడ్లు ఎక్కుతున్నాయి. దీంతో ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఉపయోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ కో రుతోంది.
