Janasena: కలిసొస్తున్న శకునం.. జనసేనకే గాజు గ్లాస్.. ఈసీ సంచలన నిర్ణయం
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఏపీ, తెలంగాణలో పోటీ చేసింది. ఏపీలో 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో ఏడు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు.

Janasena: జనసేన శ్రేణులకు గుడ్ న్యూస్. కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకే కేటాయించింది. కొద్దిరోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం జనసేన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక పార్టీకి గుర్తు ఉండబోదంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును అదే పార్టీకి కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో జనసేనను టార్గెట్ చేసుకుంటూ జరిగిన ప్రచారానికి చెక్ పడింది. దీనిపై జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలకు అధిగమించి జనసేన అసలు సిసలైన రాజకీయ పార్టీగా ఏపీ రాజకీయాల్లో నిలుస్తుందని బల్లగుద్ది చెబుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఏపీ, తెలంగాణలో పోటీ చేసింది. ఏపీలో 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో ఏడు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో సైతం మరోసారి పోటీకి జనసేన సన్నద్ధం అవుతోంది. అయితే సరిగ్గా ఇటువంటి సమయంలో కొద్దిరోజుల కిందట ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చుతూ ప్రకటన విడుదల చేసింది. దీంతో జనసేన గాజు గ్లాస్ గుర్తును కోల్పోయినట్టయ్యింది. దీనిపై జనసేన వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అసలు గ్లాసు గుర్తు వస్తుందో లేదో అన్న బెంగ వెంటాడింది.
తెలంగాణ, ఏపీ ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో కామన్ సింబల్ గా గాజు గ్లాస్ ను కేటాయించాలని కోరుతూ జనసేన నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపం మేరకు తిరిగి గాజు గ్లాస్ గుర్తును జనసేన కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో జనసేన శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరోవైపు జనసేనకు గాజు గ్లాసు లేదని ప్రచారం చేసిన వారికి ఝలక్ ఇచ్చినట్లు అయింది.
