Cheetah Suraj Died: పిట్టల్లా రాలిపోతున్న చీతాలు … ఎవరిది ఈ పాపం ?
అన్ని బాగున్నాయని అనుకుంటున్న తరుణంలో నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘సాషా’ అనే ఆడ చీతా అనారోగ్యంతో మార్చి 27న మృత్యువాత పడింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రధాన నరేంద్రమోడీ తన జన్మదినం సందర్భంగా వదిలిని ఈ చీతాల్లో ఒకటి మృతి చెందడం పట్ల పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

Cheetah Suraj Died: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణం ఆగడం లేదు. మూడు రోజుల క్రితమే ఒక మగ చీతా(తేజస్) మృత్యువాత పడింది. శుక్రవారం సూరజ్ అనే మగ చీతా కన్నుమూసింది. దీంతో మరోసారి కలకలం చెలరేగింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఈ పార్కులో 8వ చీతా మృతి చెందడం విశేషం. నాలుగు నెలల క్రితం సూరజ్‌ను నమీబియా నుంచి ప్రత్యేక విమానం ద్వారా కూనో నేషనల్ పార్క్‌కు తీసుకు వచ్చారు. అయితే దీని మృతికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉందని నేషనల్ పార్క్ అధికారులు చెబుతున్నారు.
నాలుగు నెలల క్రితం..
సరిగ్గా నాలుగు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘ ప్రాజెక్టు చీతా’లో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా నమీబియా నుంచి ప్రత్యేక విమానాల్లో రెండు విడతల్లో 20 చీతాలను తీసుకొచ్చింది. వీటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలింది. మొదట్లో వీటిని ప్రత్యేకమైన వాతావరణంలో పెంచారు. మన పరిస్థితులకు అలవాటు పడ్డాయి అని నిర్ధారించుకున్న తర్వాత అడవిలోకి వదిలారు. అయితే మొదట్లో ఆరోగ్యంగానే ఉన్న ఈ చీతాలు తర్వాత అడవి దాటి సమీప గ్రామాల్లోకి వెళ్లడం ప్రారంభించాయి. వీటిని వెతికి పట్టుకోవడం అటవీ అధికారులకు తలకు మించిన భారమైంది. అయితే వీటిని ఆఫ్రికా, నమీబియా నుంచి తీసుకొచ్చినప్పుడు మెడకు ప్రత్యేకమైన జియో ట్యాగ్‌లు తగిలించారు. వాటి ద్వారానే ఆచూకీ కనుగొనే వారు.
మృత్యు పరంపర
అన్ని బాగున్నాయని అనుకుంటున్న తరుణంలో నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘సాషా’ అనే ఆడ చీతా అనారోగ్యంతో మార్చి 27న మృత్యువాత పడింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రధాన నరేంద్రమోడీ తన జన్మదినం సందర్భంగా వదిలిని ఈ చీతాల్లో ఒకటి మృతి చెందడం పట్ల పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. మన వాతావరాణాన్ని తట్టుకోలేని చీతాలను ప్రచారం తీసుకొచ్చి బలి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఏప్రిల్ 23న ఉదయ్ అనే మగ చీతా కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో ఈ ప్రాంతంలో వాటి మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది ఇలా ఉండగానే దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో దక్ష అనే ఆడ చీతా మే 9న కన్నుమూసింది. అదే నెలలో జ్వాల అనే ఆడ చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో మూడు కన్నుమూశాయి. ఈ నెలల్లో రెండు మరణాలతో కలిపి కేవలం నాలుగు నెలల వ్యవధిలో కన్నుమూసిన చీతాల సంఖ్య 8కి చేరుకుంది. సూరజ్ అనే చీతా శుక్రవారం కన్నుమూసిన నేపథ్యంలో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఏం జరుగుతోంది?
వరుసగా చీతాలు మృతి చెందడం పట్ల కూనో నేషనల్ పార్క్‌లో ఏం జరుగుతోందో అంతు పట్టకుండా ఉంది. గతంలో ఈ పార్క్‌లో చీతాలను వదులుతున్నప్పుడే ఆ పార్క్ సమీప గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పార్క్‌లో చీతాలను వదిలిన తర్వాత అవి సమీప గ్రామాల్లోకి ప్రవేశించాయి. జంతువులను చంపి తిన్నాయి. ఇక ఆఫ్రికా, నమీబియా ప్రాంత అడవుల్లో వాతావరణానికి, మన దేశంలో అడవుల్లో వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అందువల్లే చీతాలు మన లేకపోతున్నాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. కాగా 8 చీతాలు మృతి చెందడం పట్ల ప్రధాని కార్యాలయ వర్గాల మధ్యప్రదేశ్ కునో అటవీ శాఖ అధికారులతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
